For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీకెండ్ స్పెషల్ ఫిష్ కోలీవడ రిసిపి

|

ఇటువంటి స్పెషల్ వంటలు ‘ఫిషర్ మెన్ కాలనీ' వారు మనకు పరిచయం చేస్తారు. ఈ ప్రత్యేకపమైన వంట మహరాష్ట్రలోని కోలీ లేదా ఫిషర్ మెన్ వారిది. అందుకే ఈ రిసిపికి ఫిష్ కోలీవడ అని పేరు. ఈ రుచికరమై వంట అక్కడ చాలా పాపులర్. అంతే కాదు, ముంబాయ్ లోని చిన్న పెద్ద అన్ని ఫుడ్ జాయింట్స్ లో కూడా ఇది చాలా ఫేమస్. మరి ఇంతటి రుచికరమైన డిష్ రుచి చూడటానికి ప్రతి ఒక్కరు ముంబాయ్ వెళ్ళడటానికి కుదరదుకదా. కాబట్టీ మీ సీక్రెట్ రిసిపిని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవడానికి మీకోసం ఇక్కడ తయారుచేసే విధానాన్ని వివరిస్తున్నాం.

ఈ ఫిష్ కోలీవడ తయారుచేయడానికి ముందు అరగంట సమయం మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్పైసీ బటర్ లో డిప్ చేసి, కాగే నూనెలో వేసి, డీప్ ఫ్రై చేయాలి. చాలా సులభంగా తయారుచేయవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ వీకెండ్ స్పెషల్ గా మీరు ఒక సారి ట్రైచేయండి...

 Fish Koliwada Recipe

కావల్సిన పదార్థాలు:
కింగ్ ఫిష్: 500 gms
కారం 1 ½tsp
శనగ పిండి: 100gms
పసుపు: ½tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ½ tsp
గరం మసాల: 1tsp
జీలకర్ర పొడి:1/2tsp
ఒక నిమ్మకాయంత పరిమానంలో చింతపండు
అజ్వజైన్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
(అవసరం అయితే 1/2tspతందూరి కలర్ ను మిక్స్ చేసుకోండి)

గరం మసాలా కోసం (ఈక్రింది పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి)
లవంగాలు: 2tbsp
యాలకులు: 2tbsp
సొంపుగింజ: 2tbsp
దాల్చిన చెక్కలను -3 (చిన్నవి)

తయారుచేయు విధానం :
1. ముందుగా చేపలను బాగా శుభ్రం చేసి, వాష్ చేయాలి. తర్వాత పసుపు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చేపముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటి ఒక వేబౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు పసుపు, ఉప్పు మిక్స్ చేసి పెట్టిన చేప ముక్కలను కలుపుకొన్న పిండి మిశ్రమంలో వేసి, బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో చేపముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేపముక్కలు రెడ్డిష్ బ్రౌన్ కలర్ కు మారగానే పక్కన తీసిపెట్టుకోవాలి.
5. తర్వాత ఈ వేడి వేడి ఫిష్ మీద ఛాట్ మసాలా మరియు నిమ్మరసం చిలకరించి పెట్టుకోవాలి.
అంతే రుచికరమైన కింగ్ ఫిష్ కోలీ వడ రెడీ . ఈ అద్భుతమైన ఫిష్ రిసిపిని పుదీనా చట్నీతో సర్వ్ చేయండి.

English summary

Weekend Special: Fish Koliwada Recipe

The term 'Koliwada' refers to the fishermen's colony. This recipe hails from the kitchen of the Kolis or the fishermen of Maharashtra region.
Story first published: Saturday, November 30, 2013, 11:19 [IST]
Desktop Bottom Promotion