For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2015 వరల్డ్ ఎగ్ డే స్పెషల్ గా 12 వెరైటీ ఎగ్ రిసిపిలు

|

గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు.

ఆమ్లెట్ ఎవరైనా వేస్తారు. గుడ్డుకూర చేసినవారే దూకుడులా హిట్ కొడతారు. పైన తెల్లసొన లోన పచ్చసొన విడువలేని ఆస్వాదన. హఠాత్తుగా ఊడిపడే అతిథులకు చికెనూ మటనూ లేకున్నా గుడ్డే ఘనగౌరవం. ఉడకబెట్టిన గుడ్లతో చేసే ఏవంటైనా సరే నో డౌట్ వెరీ గుడ్.

ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు

ఈ రోజు వరల్డ్ ఎగ్ డే. గుడ్ల వాడకాన్నీ, దానిలోని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్పుతూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారం నాడు ‘వరల్డ్‌ ఎగ్‌ డే' నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకోసం కొన్ని స్పెషల్ వంటలు పరిచయం చేస్తున్నాము ఎగ్ ప్రియులు ఈ వంటలతో ఈ వరల్డ్ ఎగ్ డేను హాపీగా సెలబ్రేట్ చేసుకోండి....

ఎగ్ రోల్స్:

ఎగ్ రోల్స్:

ఎగ్ రోల్స్ తయారుచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇండియన్ స్పైసీస్ జోడీంచి దీన్ని తయారుచేస్తారు. ఎగ్ ఆమ్లెట్ వేసుకొని రోటీ లేదా చపాతీ లేదా పరోటోలో పెట్టి రోల్ చేసి తినేయవచ్చు.

ఎగ్ నూడిల్స్:

ఎగ్ నూడిల్స్:

నూడిల్స్ ను కాస్త వెరైటీగా తినాలని కోరుకునే వారు గుడ్డుకు ఎగ్ మరియు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ను జోడించి మీకు నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు.

ఎగ్ బుర్జు:

ఎగ్ బుర్జు:

ప్రతి చోటా మసాలా ఎగ్ బుర్జ్ చాలా ప్రత్యేకమైన, బెస్ట్ రిసిపి. ఈ ఎగ్ బుర్జ్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. బ్రెడ్ స్లైస్, జ్యూస్ తో పాటు తీసుకొనే ఎగ్ బుర్జ్ ముంబాయ్ లో చాలా ఫేమస్. కొంత మంది ఈ ఎగ్ బుర్జ్ ను రైస్ మరియు రోటీతో తీసుకుంటారు.

డెవిల్డ్ ఎగ్స్:

డెవిల్డ్ ఎగ్స్:

బాగా ఉడికించిన గుడ్డుకు కొద్దిగా డ్రెస్సింగ్ కోసం పెప్పర్ పౌడర్ మరియు సాల్ట్ మరియు మయోనైజ్ ను జోడించి తీసుకోవచ్చు.

ఎగ్ ఖీమా:

ఎగ్ ఖీమా:

మాంసాహార ప్రియులకు ఒక అద్భుతమైన రుచితో ఓ వెరైటీ వంటకం ఎగ్ ఖీమా కర్రీ. (ఖీమా చికెన్ లేదా ఖీమా మటన్ లేదా ఖీమా బీఫ్ ఏదైనా వాడుకోవచ్చు)కాబట్టి ఖీమాకు ఎగ్ మిక్స్ చేసి ఓ వెరైటీ వంటను రుచిచూడండి. ఎగ్, ఖీమా రెండు బాగా పాపులర్ నాన్ వెజిటేరియన్. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారు చేసుకొనే వంటకం చాలా అద్భుతమైన టేస్టీతో అన్నం, రోటికి మంచి కాంబినేషన్ అవుతుంది.

ఎగ్ కర్రీ:

ఎగ్ కర్రీ:

ఇది ట్రెడిషినల్ ఇండియన్ ఎగ్ రిసిపి. స్టాండర్డ్ ఇండియన్ కర్రీ మరియు ఉడికించిన గుడ్డుతో తయారుచేసుకోచ్చు .కర్రీ తయారుచేయడానికి ముందుగా ఎగ్ ను లైట్ గా ఫ్రై చేసుకోవాలి.

ఎగ్ గార్లిక్:

ఎగ్ గార్లిక్:

అన్నం లేదా రోటీలున్నాయి. దానికి స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తున్నది. అలాంటప్పుడు గార్లిక్ ఎగ్ రిసిపి ఖచ్చింతంగా ట్రై చేయవచ్చు. దీన్ని బాయిల్డ్ ఎగ్ మరియు గార్లిక్ పేస్ట్ తో తయారుచేస్తారు .

 ఎగ్ సేమియా:

ఎగ్ సేమియా:

ఎగ్ అండ్ వర్మిసెల్లీ చాలా సింపుల్ రిసి . దీన్ని కూడా రెగ్యులర్ డైట్ లో ప్రయత్నించవచ్చు . దీన్ని బ్రేక్ ఫాస్ట్, స్నాక్ గా గా తీసుకోవచ్చు.

వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!

వేడి.. వేడిగా.. ఎగ్ సమోసా..!!

గుడ్లుతో ఎన్నో వెరైటీ వంటకాలను వండుతుంటాం. అయినా కూడా ఏదో ఒక కొత్త రుచి కోసం ప్రయత్నిస్తుంటాం. అలాంటి వాటిల్లో మసాలా ఎగ్ సమోసా ఒకటి. ఇది తయారు చేయడం చాలా సులభం.

వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్

వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అతి త్వరగా చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారు చేసుకొనే వంటకం. ఇది బ్రేక్ ఫాస్ట్ గాను లేదా మధ్యాహ్నభోజనం లేదా డిన్నర్ లోనూ తినవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లకు తయారు చేసి ఇవ్వొచ్చు.

న్యూట్రిషినల్ ఎగ్ దోస-ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

న్యూట్రిషినల్ ఎగ్ దోస-ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్

నాన్ వెజిటేరియన్ బ్రేక్ ఫాస్టుల్లో ఎగ్ దోస స్పెషల్. ఎగ్ దోస ఫ్రైడ్ ఎగ్ కు కాంబినేషన్ మరియు దోసె కూడా. మీరు మామూలుగా తయారు చేసుకొనే దోసెతో బోర్ అనిపిస్తుంటే ఈ విధంగా ప్రయత్నించి ఒక కొత్త రుచిని టేస్ట్ చేయవచ్చు. దోసె, దానిమీద ఆమ్లెట్ చాలా అద్భుతమైన టేస్ట్ ను అందిస్తుంది. ఈ ఎగ్ దోసకు చట్నీ, సాంబార్ వంటివి అవసరం ఉండదు. ఈ ఎగ్ దోసెను ఏదైనా సాస్ తో తినవచ్చు. ఎందుకంటే ఎగ్ ఫ్రై అయ్యుంటుంది. మరియు పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి తరగు వేయడం వల్ల చట్నీ అవసరం ఉండదు.

 బిర్యాని స్పెషల్- ఎగ్ బిర్యాని

బిర్యాని స్పెషల్- ఎగ్ బిర్యాని

కోడి గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డుతో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని అతిధులు వస్తే, తేలికగా ఒక ఎగ్ క్రరీ చేసేయచ్చు. అదే బ్యాచులర్స్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం సులభంగా ఎగ్ బిర్యాని చేసుకోవచ్చు.

English summary

World Egg Day 2015: 12 Yummy Dishes Dedicated For The Eggetarians

World Egg Day 2015: 12 Yummy Dishes Dedicated For The Eggetarians. If you are in love with eggs, we suggest you try more than one recipe that is mentioned on the list. Celebrate World Egg Day 2015 with a sumptuous breakfast and hey! don't forget to share some recipes around too.
Story first published: Friday, October 9, 2015, 16:38 [IST]
Desktop Bottom Promotion