For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘుమఘుమలాడే హైదరాబాదీ చికెన్ బిర్యానీ

|

బిర్యానీ అంటేనే ఘుమఘుమలాడే నాన్ వెజ్ బిర్యానీనే గుర్తుకు వస్తుంది. బిర్యానీ చికెన్, మటన్, ఫిష్ తో తయారుచేస్తారు. అయితే ఈ రోజు మీకు ఒక స్పెషల్ వంటకం హైదరాబాదీ చికెన్ బిర్యానీని పరిచయం చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాదీ చికెన్ బిర్యానీ అంటే, మొఘలాయ్ వంటలే గుర్తుకు వస్తాయి. అయితే మన హైదరాబాదీ స్టైల్ చికెన్ వంటలంటే నార్త్ ఇండియన్స్ కు చాలా ఇష్టం.

హైదరాబాదీ స్టైల్లో చికెన్ బిర్యానీ తయారుచేస్తే ఘుమఘుమలాడే వాసనతో పాటు, మంచి రుచి కూడా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతే మన ఇండియన్ మసాలా దినుసులు మరియు బాస్మతి రైస్ వల్ల ఈ చికెన్ బిర్యానీకి ఇంతటి రుచి, వాసన ఉంటుంది. మరి మీరు కూడా ఈ వీకెండ్ లో ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ టేస్ట్ చూడాలంటే ఒక సారి ట్రై చేసి చూడండి...

Yammy Hyderabadi Chicken Biryani very spicy and tasty

కావల్సిన పదార్థాలు:
మిరియాలు: 6
నిమ్మ రసం: 1tbsp
జీలకర్ర మరియు ధనియాల పొడి: 1/2tsp
లవంగాలు మరియు యాలకలు: 2+2
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయ(ఫ్రైచేసుకొన్నవి): 2 పెద్దవి
ఆయిల్ లేదా (నెయ్యి): 2tbsp
మీడియం సైజ్ ఉల్లిపాయలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
బ్లాక్ ఏలకులు: 2
తరిగిన కొత్తిమీర: 2tbsp
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
దాల్చిన చెక్క: 2 Stricks
ఫ్లేవర్డ్ రైస్(బాస్మతి): 2cups
Javeri మేస్ 1tbsp
చికెన్ మీడియం ముక్కలు: 500grms
పెరుగు: 2cups
పసుపు: కొద్దిగా
సఫ్రాన్ కలర్ : 1/2tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకొని అందులో చికెన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేయాలి.
2. తర్వాత అందులోనే, దాల్చిన చెక్క, జానపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు, పెప్పర్ కార్న్, జీకలర్ర, బ్లాక్ జీలకర్ర, బ్లాక్ యాలకలు, పసుపు, ఉప్పు, ధనియాలపొడి, గరం మసాలా, వేగించిన ఉల్లిపాయ ముక్కలు మరియు నూనె వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. చికెన్ ముక్కలకు పట్టేలా బాగా పట్టించి 1/2గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు, నూనె, ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీరు మరుగుతుండగా అరగంట ముందు నానబెట్టుకొన్న బియ్యంలో నీరు పూర్తిగా వంపేసి మరుగుతున్న నీటిలో వేయాలి.
3. బియ్యం ఆఫ్ బాయిల్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. బియ్యం సగభాగం ఉడికిన తర్వాత గంజి వంపి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి బాగా సర్ధాలి. తర్వాత దాని మీద సగం ఉడికించుకొన్న అన్నంను వేసి పూర్తిగా సమంగా సర్దాలి.
5. తర్వాత దాని మీద కొత్తిమీర, పుదీనా, వేగించుకొన్న ఉల్లిపాయ ముక్కలు, కుంకుమపువ్వు కలర్ వేసి ఆవిరి పోకుండా మూత పెట్టి అరగంట పాటు (మొదట 10మంట ఎక్కువగా పెట్టాలి. తర్వాత 10నిముషాలు మీడియంగా పెట్టాలి, తర్వాత 10నిముషాలు తక్కువ మంట మీద పెట్టి ) ఉడికించుకోవాలి. అంతే హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ.

English summary

Yammy Hyderabadi Chicken Biryani very spicy and tasty

Biryani is one of the most popular dishes in Hyderabad, India. To make Hyderabadi Biryani, the meat and the rice are cooked in an air tight pot on very low flame, so that the rice is cooked in the flavors of meat and gets the aroma of the meat.
Desktop Bottom Promotion