For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొర మీను చేపల పులుసు..ఒక్కసారైనా రుచి చూడాల్సిందే...

|

చేపలలో కొరమీను చేపకు ప్రత్యేకత ఉంది. కొరమీను పులుసు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓసారి రుచి చూస్తే తప్ప ఆ మజా ఏంటో అర్ధం కాదు. రుచి మాత్రమే కాదు వీటిలో తైలము ఎక్కువ & విటమిను ' ఎ , డి , ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికము గా ఉంటాయి . మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది.

అచ్చంగా మంచినీటిలో మాత్రమే పెరిగే ఈ చేప తల పాముని పోలి ఉంటుంది. అందుకే దీన్ని స్నేక్‌ హెడ్‌ ఫిష్‌ అంటారు. ఒకటే ముల్లు ఉండే ఈ చేప రుచిలోనే కాదు, పోషకాల్లోనూ మేటే. పులుసయినా వేపుడయినా ఏదయినా అదుర్సే. అందుకే ఇదంటే అంత ఇష్టం. వీటిల్లో మగ, ఆడ రెండూ కూడా సీజన్‌లో నీటి అడుగున గూడు కట్టి గుడ్లను పెట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడతాయి. శస్త్రచికిత్సానంతరం ఈ చేపను తినడంవల్ల గాయం త్వరగా మానుతుందని అంటారు. మరి ఇన్నిబెనిఫిట్స్ ఉన్న కొరమీన చేపల పులుసు ఒక్కసారైనా తినాల్సిందే. మరి ఇది ఎలా తయారుచేయాలో చూద్దాం...

 Korramenu Chepala Pulusu


కావల్సిన పదార్థాలు:
కొరమీను చేపలు: 1/2kg
ఉల్లిపాయలుం 3(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4
కారం: 1tbsp
పసుపు: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
నీళ్లు: 1cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
ధనియాలపొడి: 1tsp#
గరం మసాల: 1/4tsp
కొత్తమీర: 1కట్ట

మస్టర్డ్ ఫిష్ కర్రీ రిసిపి: సీ ఫుడ్ స్పెషల్ రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా కొరమీను చేప ముక్కలను శుభ్రం చేసుకొని, వాటికి కారం, పసుపు, ధనియాలపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి అరగంట నానబెట్టుకోవాలి.
2. తర్వాత నూనె వేసి వేడి చేసుకొని ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి.
3. వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత చేపముక్కలు వేసి 2నిముషాలు వేగించుకొని కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి సన్నని మంట మీద అరంట పాటు ఉడికించుకోవాలి.
4. చివరగా కొత్తమీర తరుగుతో గార్నిష్ చేస్తే కొరమీను చేపల పులుసు రెడీ.

English summary

Yammy Korramenu Pulusu: Healthy and Tasty Korramenu Chepala Pulusu

Yammy Korramenu Pulusu: Healthy and Tasty Korramenu Chepala PulusuKorrameenu Fish Curry Recipe is a famous fish curry from the coasts of Kerala. The word Meen means fish and Moilee is the stew. The fish is cooked in a coconut milk stew with very little spices so that the flavour of the fish dominates the dish.
Story first published: Tuesday, December 8, 2015, 13:48 [IST]
Desktop Bottom Promotion