For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్మీ అండ్ టేస్టీ గ్రీన్ మసాలా ఫిష్ ప్రై రిసిపి

|

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది సౌత్ ఇండియన్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ప్రైను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...

Yammy and Tasty Green Fish Fry Recipe

కావల్సిన పదార్థాలు:
గ్రీన్ మసాలా కోసం :
పచ్చిమిర్చి: 4-5
కొత్తిమీర: కొద్దిగా
పుదీనా : కొద్దిగా
కరివేపాకు : కొద్దిగా

మసాలా కోసం కావల్సినవి:
పసుపు: 1/4tsp
గరం మసాలా : 1tsp
ధనియాలపొడి: tsp
కారం: 1 tsp
జీలకర్రపొడి: 1/2tsp
మిరియాలపొడి: 1/2tsp
ఆలివ్ ఆయిల్: 2tbsp
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
కార్న్ ఫ్లోర్, : 2tsp
బియ్యంపిండి: 2tsp
ఉప్పు: రిచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నిమ్మరసం : కొద్దిగా

తయారుచేయు విధానం :
1. ముందుగా మిక్సీ జార్ లో గ్రీన్ మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలను వేసి, కొద్దిగా రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత చేపముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి శుభ్రంగా కిడిగి నీరు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పు బౌల్ తీసుకొని అందులో చేపముక్కలు, ముందుగా రెడీ చేసుకొన్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఆలివ్ ఆయిల్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు నిమ్మరంస వేసి మొత్తం మిశ్రమం బాగా కలగలుపుకోవాలి.
5. తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి.
6. చివరగా కార్న్ ఫ్లోర్ మరియు బియ్యం పిండి వేసి మొత్తం మిశ్రమం మరోసారి బాగా కలగలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి.
7. ఒక గంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనెను డీప్ ఫ్రైకి సరిపడా వేసి, కాగిన తర్వాత ఒక్కొక్క చేపముక్కను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారే వారకూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ.

English summary

Yammy and Tasty Green Fish Fry Recipe

Fish fry is a very popular dish all over India, especially in Kerala, Green Coriander Fish very tasty. A unique flavor and the fish simply melts into your mouth. Easy to make with some spicy ingredients and a tasty family meal.
Story first published: Thursday, March 3, 2016, 13:14 [IST]
Desktop Bottom Promotion