For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్మీ కోకనట్ మిల్క్ : చికెన్ కర్రీ రిసిపి

|

చికెన్ అత్యధిక ప్రోటీన్స్ ఉన్న హెల్తీ ఫుడ. మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో లీన్ మీట్ ను జోడించుకోవాలి . చికెన్ లో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది, దాంతో కొవ్వు కరగడానికి, దాని ద్వారా శరీరంలో అదనపు క్యాలరీలు తగ్గించుకోండానికి సమాయపడుతుంది. చికెన్ ఇష్టపడే వారు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ చూడాలనుకుంటే కోకనట్ మిల్క్ విత్ చికెన్ ట్రై చేసి చూడండి..

చాలా వైటీగా, కమ్మని రుచి కలిగి ఉంటుంది . ఈ యమ్మీ డిష్ ను పీస్ పులావ్ కి సైడ్ డిష్ గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేయడం వల్ల ఆరోమా వాసనతో నోరూరిస్తుంటుంది. చికెన్ కర్రీని తయారుచేసేప్పుడు కొన్ని అదనపు మసాలా దినుసులను జోడించండి..

 Chicken Curry With Coconut Milk Recipe

చికెన్: ½ kg (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు : 4
పచ్చిమిర్చి : 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం తురుము: 1tbsp
పసుపు : 1/4tsp
కారం : 1tbsp
పెప్పర్ పౌడర్ : 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా : 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
కొబ్బరి పాలు : ½ cup
టమోటా : 2tbsp
ఆవాల గింజలు : 1tbsp

తయారుచేయు విధానం:
1. ఒక రౌండ్ బాటమ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. నూనె వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత ఇందులో పసుపు వేసి మిక్స్ చేస్తూ మొత్తం మిశ్రమాన్ని వేగించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కారం మరియు పెప్పర్ పొడి, ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేసి ఫ్రైచేసుకోవాలి.
3. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి, స్పూన్ తో చికెన్ ను బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా వేసి మరోసారి మిక్స్ చేయాలి.
4. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి, మంటను మీడియంగా పెట్టి, పాన్ మీద మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది.
5. 10 నిముషాల తర్వాత మూత తీసి, మరో సారి కలియబెట్టాలి. టేస్ట్ చూసి అవసరం అయితే మరికొద్దిగా గరం మసాలాను, కొబ్బరి పాలు వేసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
6. మరో చిన్న పాన్ తీసుకొన అందులో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయలు, మరియు కరివేపాకు వేసి పోపు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును ఉడుకుతున్న చికెన్ కోకనట్ మిల్క్ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే యమ్మీ చికెన్ కర్రీ విత్ కోకనట్ మిల్క్ రిసిపి రెడీ...

English summary

Yummy Chicken Curry With Coconut Milk Recipe

Chicken is one of the foods which is highest in protein. If you are on a weight loss, then you should add this lean meat to your diet. Chicken has a lot of other benefits too, although it induces heat in the body.
Desktop Bottom Promotion