For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్ట్ అండ్ హెల్తీ మటన్ పాయ రిసిపి

|

బిర్యానీ లేదా మటన్ గ్రేవీతో బోర్ గా అనిపిస్తుందా?మరి మీకు ఏదైనా డిఫరెంట్ గా తయారుచేయడం నేర్చుకోండి . ఇండియాలో మటన్ పాయ చాలా అద్భుతమైన రుచికలిగి ఫేమస్ రిసిపి. ముఖ్యంగా పాయ సూప్‌ మాదిరిగా తయారయ్యే ఘుమఘుమలాడే పాయ టేస్టే వేరని భోజనప్రియులు అంటారు. రాయలసీమ వంటకాల్లో పాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సీమ వాసులు ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.

మటన్ పాయను వివిధ రకాల ఇండియన్ మసాల దినుసులను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ నోరూరించే వంటను కోకోనట్ రైస్ లేదా బిర్యానీకి ఒక సైడ్ డిష్ గా లేదా మెయిన్ డిష్ గా కూడా తింటారు. మరి ఈ పాయ రిసిపిని మీరు టేస్ట్ చేయాలంటే ముందుగా ఎలా తయారుచేయాలో తెలుసుకోండి....

Yummy Mutton Paya Recipe

కావలసినవి:
కాల్చిన మేకకాళ్లు: 4
ఉల్లిపాయలు: 4
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbsp
కారం: 2tsp
ధనియాలపొడి: 3tsp
టొమాటోలు: 1/2kg
చింతపండు: నిమ్మకాయంత
కార్న్ ఫ్లోర్(జొన్నపిండి): 4tbsp
గరంమసాలా: 1/2tbsp
కొత్తిమీర: 1cup
పుదీనా: 1cup
పచ్చిమిర్చి: 8
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేసే విధానం:
1. ముందుగా మేకకాళ్లను శుభ్రంగా కడిగి చాకుతో పైన గాట్లు పెట్టి తరవాత ముక్క విరగక్కుండానే నలిగినట్టుగా కొట్టించాలి.
2. ఈ ముక్కల్ని ప్రెషర్‌పాన్‌లో వేసి 7 గ్లాసుల నీళ్లు పోయాలి. అందులోనే రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయాలి. ఉప్పు, ధనియాలపొడి, పసుపు కూడా వేసి మూతపెట్టి 4విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత మంట తగ్గించి సిమ్‌లో అరగంటసేపు ఉంచాలి. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడుకుతాయి.
3. మిగిలిన రెండు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరగాలి.
4. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి, కారం, ధనియాలపొడి, జొన్నపిండి వేసి బాగా వేయించాలి.
5. ఆ తరవాత టొమాటో ముక్కలు, చింతపండు రసం పోయాలి. ఇప్పుడు ఉడికించిన కాళ్లను రసంతో సహా, కొత్తిమీర, పుదీనా తరుగుకూడా వేసి మరో రెండు నిమిషాలు మరిగించి దించాలి. అంతే మటన్ పాయ రెడీ. కాల్షియం లోపంతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మంచిది.

English summary

Yummy Mutton Paya Recipe

Bored of biryani and mutton gravy? Then you should try out something different this afternoon for lunch! The yummy mutton paya is a famous delicacy in most parts of India. Though mutton paya takes up a lot of time, you will not regret it since it is a dish to die for.
Story first published: Monday, April 28, 2014, 18:00 [IST]
Desktop Bottom Promotion