For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఘుమఘుమలాడే నాన్ వెజ్ వంటలు: బక్రీద్ స్పెషల్

|

ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది.

ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఆ బహార్ కోసమే ఈ వంటలు...

భునా గోష్ట్ నాన్ వెజ్ రిసిపి

భునా గోష్ట్ నాన్ వెజ్ రిసిపి

భునా గోష్ట్ ఒక ట్రెడిషినల్ నాన్ వెజ్ రిసిపి. సాధారణంగా ఈ వంటను మేక మాంసంతో తయారుచేస్తారు. మటన్ ను చాలా నిధానంగా అతి తక్కువ మంట మీద ఉడికిస్తారు. అంతే కాదు ఈ వంటకు వివిధ రకాల ఇండియన్ మసాలా దినుసులు జోడించి చేయడం వల్ల అంతటి రుచి దీనికి వస్తుంది .ఈ వంటను చిక్కటి గ్రేవీగా తయారుచేస్తారు. ఈ భునా గోష్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. మరియు డ్రైవెల్ వెట్ గ్రేవీ చూడగానే నోరూరిస్తుంటుంది. ఇది పుల్కా మరియు నాన్ లకు మంచి కాంబినేషన్ .మరి ఈ స్పెషల్ వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..

RECIPE

స్వీట్ కాశ్మిరీ మటన్ బిర్యానీ

స్వీట్ కాశ్మిరీ మటన్ బిర్యానీ

మీరు ఎప్పుడైనా కాశ్మీరి మటన్ బిర్యానీ ట్రై చేశారా?ఇండియాలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన రిసిపి మరియు ఈ బిర్యానీ చాలా మంది ఇష్టపడుతారు. ఈ బిర్యానీ రిసిపి స్వీట్ అండ్ స్పైసీ రుచిని కలిగి ఉంటుంది. ఈ రుచికరమైన మటన్ బిర్యానీ స్పైసీస్ తో లేయర్స్ గా పరిచి, ప్లమ్స్ తో మరియు జీడిపప్పుతో మిక్స్ చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది . మరి ఈ రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా తయారుచేయాలా చూడండి..

Recipe

షహీ మటన్ కుర్మా రిసిపి

షహీ మటన్ కుర్మా రిసిపి

ప్రస్తుతం బక్రీద్ సీజన్. బక్రీద్ ను రెండు మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. మేము మీకోసం వివిధ రకాల మాంసాహార వంటలను పరిచయం చేస్తున్నాము. ఇవి చాలా డిఫరెంట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ మాంసాహార వంటల్లో షహీ మటన్ కుర్మా రిసిపి కూడా ఒకటి . ఇది ఒక రాయల్ కిచెన్ వంట, ఇది నిజామ్ ల కాలం నాటి అద్భుతమైన రుచికరమైన వంట. షహీ మటన్ కుర్మాను ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

RECIPE

స్పైసీ దాల్ గోష్ట్ - స్పెషల్ మటన్ రిసిపి

స్పైసీ దాల్ గోష్ట్ - స్పెషల్ మటన్ రిసిపి

మీరుమాంసాహారాల ప్రియులైతే అందులోనూ మటన్ ఎక్కువగా ఇష్టపడే వారైతే, మీరు వివిధ రకాల మటన్ రిసిపిలను తినవచ్చు. ఈ మటన్ కర్రీ స్పెషాలిటీ ఏంటేంటే దాల్. వివిధ రకాల పప్పులు మటన్ తో చేర్చి తయారుచేస్తారు. అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా... ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ గా ఉండే ఈరెండింటికాంబినేషన్ రిసిపిని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం...

RECIPE

టేస్టీ అండ్ హెల్తీ మటన్‌ హలీమ్‌

టేస్టీ అండ్ హెల్తీ మటన్‌ హలీమ్‌

హలీం : రంజాన్ మరియు బక్రీద్ నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్‌ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నం(జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌) ని సొంతం చేసుకొంది.

RECIPE

బోటీ కబాబ్ రిసిపి:

బోటీ కబాబ్ రిసిపి:

అవ్వాది కుషన్ అంటే ఆహార ప్రియలకు మరింత ప్రియం. ఎందుకంటే అవ్వాది కుషన్స్ లో అద్భుతరుచిగల బిర్యానీ, కుల్చా, పరాటా మరియు కబాబ్స్ వంటివి నోరూరించేస్తుంటాయి. అవాద్ నవాబ్ కాలం నాటి ఈ రుచులకు మహా క్రేజ్ అందుకే మన ఇండియన్ కుషన్స్ లో అవ్వాది రుచుల నోరూరిస్తుంటాయి. అవ్వాది కుషన్స్ లోని కబాబ్ లో కకోరి కబాబ్, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే జలవాతీ, బోటీకబాబ్ మొదలగునవి చాలా పాపులర్ అయినటువంటి కబాబ్స్. మరి మీరు కూడా ఈ అవ్వాది డిష్ ను రుచి చూడాలంటే మీకోసం ఒక బోటీ కబాబ్ రిసిపి...

RECIPE

English summary

Yummy Mutton Recipes For Bakrid

Bakrid or id-ul-adha is one of the most auspicious festivals for all the muslims. The main importance of this festival is the spirit of sacrifice.
Story first published: Thursday, September 24, 2015, 15:38 [IST]
Desktop Bottom Promotion