For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ్నీ షేజ్వాన్ చికెన్ నూడిల్స్

|

మన ఇండియన్ వంటలను తిని మీకు బోరు కొడుతోందా? ఏదైనా వెరైటీగా చైనీస్ డిష్ లను తినాలని కోరిక కలుగుతోందా? చైనీస్ ఫుడ్ కొన్ని స్పైసీగా కలర్ ఫుల్ గా నోరూరిస్తుంటాయి . అటువంటి ఫుడ్స్ లో ఈ షేజ్వాన్ చికెన్ నూడిల్స్ ఒకటి.

చైనీస్ రెస్టారెంట్స్ కు వెళ్ళినప్పుడు మొదట మీ మెదడులో మెలిగేది నూడిల్స్ . కాబట్టి, అటువంటి నూడిల్స్ రిసిపిని మనం ఇంట్లోనే ఎందుకు ఉపయోగించకూడదు. మరి అటువంటి చైస్ డిస్ ను మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఈ క్రింది పద్దతిని ఫాలో అవ్వండి...

Yummy Schezwan Chicken Noodles Recipe

కావల్సిన పదార్థాలు:
హక్కా నూడుల్స్: 4cup(ఉడికించినవి)
చికెన్ : 500 grms(ఉడికించినది)
వెల్లుల్లి : 2 tsp
కొత్తిమీర : 1tbsp
మిక్స్డ్ వెజిటేబుల్స్: 3cups(క్యారెట్లు, మిరప, బీన్స్, క్యాబేజీ)
షేజ్వాన్ సాస్: ½cup
బీన్ మొలకలు : ½cup
టోఫు ; ½ cup(cubesగా కట్ చేసుకోవాలి)
నూనె : 2tbsp
చిల్లీ ఆయిల్ : 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె మరియు చిల్లీ ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత అందులో కొత్తిమీర తరుగు, మిక్స్డ్ వెజిటేబుల్స్ ను 4-5నిముషాలు వేసి వేగించుకోవాలి.
3. తర్వాత ఇందులో చికెన్ ముక్కలను కూడా వేసి కొద్ది సేపు ఫ్రై చేసుకోవాలి. మసాల పట్టే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. పది నిముషాలు వేగించుకొన్న తర్వాత అందులో షేజ్వాన్ సాన్ కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో ఉడికించిన నూడిల్స్, బీన్స్, మొలకలు, టోఫు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
6. బాగా మిక్స్ చేస్తూ మరికొద్దిపేపు వేగించి స్టౌ ఆఫ్ చేసి కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే షేజ్వాన్ చికెన్ నూడిల్స్ రెడీ. ఈ రుచికరమైన నూడిల్స్ ను వెజిటేరియన్ డ్రై చైనీస్ డిష్ గాను లేదా నాన్ వెజిటేరియన్ గ్రేవీగాను తినవచ్చు.

English summary

Yummy Schezwan Chicken Noodles Recipe

Are you in the mood to eat some yummy chinese khana? If you are fond of spicy food, then this schezwan chicken noodles recipe is the perfect cuisine to lay on your table tonight.
Story first published: Tuesday, June 10, 2014, 18:59 [IST]
Desktop Bottom Promotion