For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుత రుచులతో వివిధ రకాల లడ్డులు-దివాళి స్పెషల్

|

దీపావళి వచ్చేసింది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు.

ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన రకరకాల స్వీట్స్ తయారుచేసుకుంటారు. వాటిలో లడ్డులు స్పెషల్. లక్ష్మీ దేవిని నైవేద్యం పెట్టాలన్నా, అతిథులను ఆనంద పరచాలన్నా దీపావళి రోజు ఇంట్లో లడ్డులు చేయాల్సిందే..మరి వివిధ రకాల లడ్డులో మీకోసం క్రింది స్లైడ్ లో...

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

మలై లడ్డు:

పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందుకే ఈ దసరాకు మీకోసం.. 'లడ్డూ స్పెషల్'.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

చూర్మా లడ్డు:

పండుగలు వచ్చాయంటే చాలు ఏమేమి పిండి వంటలు వండాలి. దేవుడికి ఏవేవి నైవేద్యం పెట్టాలి. ఇంటికొచ్చే అథితులకు ఏమి ఆతిథ్యం ఇవ్వాలని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏవైనా వెరైటీగా చేస్తే బాగుండు అనుకుంటారు.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

బాదాం లడ్డు:

బాదాం బేసన్ లడ్డు చాలా రుచికరమైన స్వీట్. ఇది శెనగ పిండి, బాదం పొడి మిశ్రమంతో తయారు చేస్తారు. చేయడం కూడా సులభమే. సమయం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఈ వంట చేయడానికి 15-20నిమిషాలు వ్యవధి పడుతుంది. ఇవి పిల్లలకు పెద్దలకు ఇష్టమైన రుచికరమైన వంటకం.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

మోతీచూర్ లడ్డు:

ఈ లడ్డు రిసిపి, మిగిలిన లడ్డు రిసిపిలలో కంటే ఎక్కువ ఫేమస్ కలిగినది. మోతీచూర్ లడ్డ ఇండియాలో అన్నీ కార్యక్రమాల్లోనూ తయారుచేసుకొనేటటువంటి ఇక అద్భుతమైన వంట. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు ఒకట్టి తింటే చాలు పండగ పిండివంటలన్నీ తిన్నంత ఆనందం కలుగుతుంది.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

బూందీలడ్డు:

పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దీపావళి, దరసరా వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మహా ఇష్టమే. అందుకే ఈ దీపావళికి మీకోసం.. 'లడ్డూ స్పెషల్'.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

డ్రై ఫ్రూట్ లడ్డు:

డ్రై ఫ్రూట్ లడ్డును వివిధ రకాల ఎండిన ఫలాలను ఉపయోగించి లడ్డును తయారుచేస్తారు. పండుగ రోజున చేసే లడ్డులన్నింటిలోకి చాలా ఆరోగ్యకరమైనది ఈ లడ్డు, డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

కొబ్బరి లడ్డు:

ఇది ఒక అద్భుతమైన రుచికలిగిన వెరైటీ లడ్డు ఇది. దీన్ని తాజా కొబ్బరి తురుము మరియు పంచదారతో తయారుచేస్తారు. ఈ లడ్డు తయారుచేయడానికి పంచదారకు బదులు బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

రవ్వ లడ్డు:

రవ్వ లడ్డును సేమియా లేదా రవ్వతో తయారుచేస్తారు. బియ్యం రవ్వ లేదా, గోధుమ రవ్వతో తయారుచేస్తారు . ఈలడ్డు ఆరోగ్యంకరం మరియు టేస్టీ కూడా. మీరు రెగ్యులర్ గా తయారుచేసుకొనే మోతీ చూర్ లడ్డు బోరుకొడుతుంటే, రవ్వ లడ్డును ప్రయత్నించండి.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

మ్యాంగో లడ్డు:

మ్యాంగో లడ్డు సమ్మర్ లోనే కాకుండా ఇతర సీజన్లలో కూడా తయారుచేసుకోవచ్చు. మామిడి పండ్ల సీజన్ లో కాకుండా ఇతర సీజన్లలో చేయాంటి మ్యాంగో ఎసెన్స్ ను ఉపయోగించి తయారుచేసుకోవచ్చు . ఈ మ్యాంగో లడ్డును మ్యాంగో ఎసెన్స్ లేదా మామిడిపండ్లు, పంచదారతో తయారుచేస్తారు.

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

లడ్డులలోనే వివిధ రకాల రుచులు..దీపావళి స్పెషల్

కొబ్బరి లౌజు:

ఈ లడ్డు కొబ్బరి లడ్డులాగే ఉన్నా, ఈ లడ్డును పంచదార పాకం లేదా బెల్లం పాకం పట్టి, అందులో కొబ్బరి తుము వేసి, కొన్ని డ్రై ఫ్రూట్స్ జోడించి లడ్డులా చుడుతారు. ఇది చాలా టేస్టీగా సిరఫ్ తో నిండి ఉంటుంది.

English summary

10 Awesome Ladoo Recipes For Diwali

Any Indian festival is incomplete without sweets. On top of that if it is the festival of Diwali, then sweets have to be on the priority list of foods. Sweets play a crucial role during Diwali. On this auspicious occasion, you are generally visited by relatives, neighbours and friends.
Desktop Bottom Promotion