For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమ్ కా పన్నా ట్రై చేయండి..టేస్ట్ చేయండి.

|

ఎండలో కాసేపు అలా బయటికెళ్లి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనసు శీతలపానీయాలవైపు లాగుతూ ఉంటుంది. నిమ్మరసం, మజ్జిగ ఎప్పుడూ తాగేవే. కాస్త వెరైటీగా ఇంకేదైనా అనుకునే వారికోసం ఇంట్లోనే పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసుకోవచ్చు.

వేసవిలో ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక రేగిపోతుంటుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్‌ జిల్‌మనిపించేలా
ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది. అటువంటి సమయంలో చల్ల..చల్లగా .. మీ నోటికి అందాలి ఆమ్ కా రస్నా. ఇది ఒంట్లో వేడిని చల్లబరిచి, తేలికగా అరిగిపోయే డ్రింక్ ట్రై చేయండి. టేస్ట్ చేయండి.

Mango

కావలసిన పదార్థాలు:
మామిడికాయలు: 2
బెల్లం: 150 గ్రా
జీలకర్ర: 1tsp(వేయించి, పొడి చేయాలి)
ఉప్పు: రుచికి తగినంత
నీళ్లు: 1/2lts
బ్లాక్ సాల్ట్: 1tsp
మ్యాంగో ఎసెన్స్: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మామిడికాయలను కడిగి, తగినంత నీరు పోసి ఉడికించాలి.
2. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రింది దించి చల్లార్చుకోవాలి.
3. చల్లారిన తర్వాత, గుజ్జు తీసి, మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి.
4. ఇప్పుడు నీళ్లలో బెల్లం, ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
5. గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. ఈ పానీయాన్ని సేవించడం వల్ల శరీరంలో వేడి, అతిదాహం తగ్గుతాయి.

English summary

Aam ka Panna recipe -Summer Special

Indian Summer drink Aam Panna is made with Green Mango with added spices. It has a beautiful balance of sweet and sour flavors. Aam ka panna is a delicious and spicy drink made with raw mangoes, pepper powder and sugar.
Story first published: Thursday, April 25, 2013, 16:56 [IST]
Desktop Bottom Promotion