For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ కా హల్వా : హోళీ స్పెషల్

|

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి..వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ..జయహోళీ అవుతుంది.

పొట్లాలలో నిండి రంగులపొడితో బకెట్ల కొద్దీ రంగు నీళ్ళతో గడప వరకూ నిలబడింది హోలీ! ఈ ఆనంద హోళీ వేళ ఇంట్లో స్వీట్ వండకపోతే ఎలా చెప్పండి అందుకే మీకోసం ఒక సులభమైనటువంటి చిటికెలో తయారుచేసే ఆలూ కా హల్వాను మీకు పరిచయం చేస్తున్నాం.. చాలా సింపుల్ గా చాలా త్వరగా రెడీ అవుతుంది. ఈ స్వీట్ రిసిపి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి...

Aloo Ka Halwa: Holi Special

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన బంగళా దుంపలు: 8-9
పంచదార: 1/4cup
బాదం: గుప్పెడు
పిస్తా: 2-3(ముక్కలుగా విడగొట్టుకోవాలి)
నెయ్యి: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఉడికించిన బంగాళదుంపలకు పొట్టు తీసి మొత్తగా చిదిమి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి.
3. ఇప్పుడు అందులో చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి బాగా మిక్స్ చేయాలి. పాన్ కు అట్టుకోకుండా మిక్స్ చేయాలి.
4. కొద్దిసేపు అలాగే మిక్స్ చేస్తుండాలి. మీకు నెయ్యి తక్కువగా అనిపిస్తే కొద్దిగా జోడించుకోవచ్చు.
5. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార పూర్తిగా కరిగే వరకూ మిక్స్ చేయాలి.
6. పంచదార కరిగిపోయి, బంగాళదుంపతో బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, హల్వాన్ ప్లేట్లోనికి తీసుకొని, దాని మీద బాదం, పిస్తా, గార్నిష్ చేసి హోళీ రోజున సర్వ్ చేయవచ్చు.

English summary

Aloo Ka Halwa: Holi Special

The mashed potatoes are cooked with loads of ghee and the authentic taste of nuts in this halwa can make you salivate!
Story first published: Friday, March 14, 2014, 17:45 [IST]
Desktop Bottom Promotion