For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ సమోసా: మాన్ సూన్ స్నాక్ రిసిపి

|

వర్షాకాలంలో సాయంత్రపు చిరుజల్లుల్లో ప్రతి ఇంట్లోనూ వేడివేడిగా కాఫీతో పాటు, కారంగా ఏదైనా చిరుతిండ్లు చేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మన ఇండియాలో వర్షాకాలం అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంట్లో వారందరూ ఒక చోట చేరి వేడి వేడి కాఫీ, ఛాట్స్ తీసుకుంటు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఛాట్స్ అంటే ముఖ్యంగా బజ్జీ, పకోడా సమోసా..సమోసాలో వివిధ రకాలున్నాయి. అందులో ఉల్లిపాయ సమోసా లేదా ఆలూ సమోసా ఇలా వివిధ రకాలు వర్షాకాలంలో ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే చిరుతిండ్లు.

సాధారణంగా బంగాళదుంపతో తయారుచేసే వంటలు కడుపు నిండేట్లు చేస్తాయి. అందులో బంగాళదుంప ఉపయోగించడం స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా కలిగి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఆలూతో తయారుచేసే వివిధ రకాల స్నాక్స్ లో ఆలూ సమోస ఒకటి. పొటాటో మిశ్రమాన్ని స్టఫ్ చేసి డీఫ్ ఫ్రై చేస్తారు. చాలా రుచికరంగా ఉంటుంది. వర్షకాలంలో దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళదుంప మరియు గ్రీన్ పీస్ ను స్టఫ్ చేయడం వల్ల మరి రుచి, ఫ్లేవర్ కలిగి ఉంటుంది. మరి మీరు ఈ కొత్త రుచిని టేస్ట్ చేయాలంటే ఒక సారి ప్రయత్నించండి..

Aloo Samosa: Evening Snack Recipe

కావల్సిన పదార్థాలు:
మైదాం 250grm
బంగాళదుంపలు: 2cups(బంగాళదుంపలను ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిబఠానీలు: కొద్దిగా
పచ్చిమిర్చి: 4-5(సన్నగా తరిగి పెట్టుకోవలి)
వేరుశెనగపప్పులు: కొద్దిగా
జీలకర్ర: 1/2tsp
గరం మసాలా: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
మ్యాంగో పౌడర్: 1tsp
జీలకర్ర పొడి: కొద్దిగా
ఉప్పు:రుచికి సరిపడా
కారం: కొద్దిగా
పసుపు: 1/4tsp
అజ్వైన్: 1tsp
గోరువెచ్చని నీరు: పిండికలుపుకోవడానికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నెయ్యి: సమోసా రెడీ చేయడానికి

తయారుచేయు విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని నీరు, నెయ్యి, ఉప్పు, అజ్వైన్, మైదాపిండి వేసి మొత్తం మిశ్రమాన్ని సాఫ్ట్ గా కలుపుకోవాలి. సాప్ట్ గా కలుపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కొద్దిగా నూనెను పాన్ లో వేసి వేడి చేసి అందులో జీలకర్రవేసి, వేగిన తర్వాత మ్యాంగో పొడి, పచ్చిమిర్చిముక్కలు, పసుపు, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేయాలి.
3.ఇప్పుడు అందులో బంగాళదుంపల ముక్కలు, పచ్చిబఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశెనగపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.అవసంర అయితే ఉప్పు కూడా వేసి మరో సారి కలుపుకోవాలి.
4. అలాగే అందులో గరం మసాలా, ఛాట్ మసాలా, ఒకటి రెండు నిముషాలు వేగించుకొని, తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దిగా తీసుకొని పూరీల్లా వత్తి, తర్వాత అందులో బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. తర్వాత త్రికోణాక్రుతిలో ఫోల్డ్ చేసి అంచులను గట్టిగా ఒత్తుకోవాలి.
6. ఇలా అన్నింటిని తయారుచేసి పెట్టుకొన్న తర్వాత, స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి వేడి చేయాలి.
7. నూనె వేడయ్యాక అందులో సమోసాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీఫ్ ఫ్రై చేసి పెట్టుకోవాలి.
8. తర్వాత వీటిని తీసి టిష్యు పేపర్ మీద వేసి అదనపు నూనె పీల్చుకొన్న తర్వాత వీటిని తీసి సర్వింగ్ ప్లేట్ లో సర్ది, టమోటోకెచప్ లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయాలి. అంతే ఆలూ సమోసా రెడీ...

English summary

Aloo Samosa: Evening Snack Recipe

Aloo samosa is a crisp and tasty snack which can be teamed up with tea or can be eaten with tomato ketchup as an evening snack. Samosas are made with various ingredients such as aloo, vegetables, paneer or sweet stuffing. Take a look at the aloo samosa, an evening snack recipe.
Story first published: Saturday, October 25, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion