For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ టోస్ట్ శాండ్ విచ్- టేస్టీ స్నాక్

|

ఆలూ టోస్ట్ శాండ్ విచ్ చాలా సింపుల్ రిసిపి. పిల్లలు కూడా తయారు చేసేసుకోవచ్చు. అంత సులభం. ఆలూ టోస్ట్ కు కావల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. ఆ ఆలూ టోస్ట్ ను ఈవెనింగ్ స్నాక్ గా మీకు నచ్చిన స్పైసీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

త్వరగా తయారు చేసే ఈ ఆలూ టోస్ట్ శాండ్ విచ్ కు కొత్తిమీర చేర్చడం వల్ల అదనపు టేస్ట్ ను అంధిస్తుంది. మరి ఆలూ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Aloo Toast Sandwich

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్: 10
బంగాళదుంపలు: 1/2kg
పచ్చిమిర్చి: 4
బ్లాక్ సాల్ట్: 1/2tsp
కారం: 1/2tsp
చాట్ మసాలా: 1tsp
కొత్తిమీర: 1కట్ట
శెనగపిండి: 1cup
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, ఉప్పు, తరిగిన కొత్తిమీర, బంగాళదుంప వేసి బాగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక్కో బ్రెడ్ స్లైస్ కు ఒకవైపున పూయాలి. తర్వాత రెండు ముక్కను ఆలూ మిశ్రమం పూసిన వైపుకు కలిపి దగ్గరగా అతికించాలి.
4. ఇప్పుడు ఓ గిన్నెలో సెనగపిండి, కారం, ఉప్పు వేసి జారుగా కలపాలి. కలుపుకొన్న తర్వాత ఒక్కో బ్రెడ్ టోస్ట్ను పిండిలో ముంచి కాగే నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.
5. అంతే వీటిని శాండ్ విచ్ లా త్రికోణాకారంలో కత్తిరించి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Aloo Toast Sandwich

Aloo Toast” is one of most simple recipe that even a kid can cook. This sandwich is quite filling and can be enjoyed during anytime of the day. You can get really creative with it and combine it with coriander chutney, fresh cut salad, cheese, mayonnaise, etc. This however, is the simplest and the easiest version of all.
Story first published: Wednesday, May 29, 2013, 16:56 [IST]
Desktop Bottom Promotion