For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ ఎగ్ కబాబ్-రంజాన్ స్పెషల్

|

రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. ఉపవాస దీక్షవిరమించడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి ముందు స్నాక్స్, లేదా ద్రావాహారాను తీసుకోవడం మస్లీములకు అలవాటు.

స్నాక్స్ లో మటన్, చికెన్ తో వివిధ రకాల వెరైటీ వంటలను వండుతారు. వాటిలో, అండాకబాబ్ ఒకటి, ఇది హెల్తీ స్నాక్ మరియు కడుపు ఫుల్ గా ఉండేలా చేస్తుంది. మరి మీరు ఈ హెల్తీ ఈవినింగ్ స్నాక్ ను రుచి చూడాలంటే ఒక సారి ట్రై చేయండి. చాలా సింపుల్, అండ్ హెల్తీ కూడా...

Anda Kabab

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ మటన్: 300grms
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1/2tsp
పచ్చిమిర్చి: 4
గరం మసాలా: చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
పెరుగు: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిబొప్పాయి తురుము: 2tsp
నిమ్మకాయ: 1
కొత్తిమీర: ఒక కట్ట
కోడిగుడ్లు: 3
మిరియాల పొడి: 1/2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఇలా గ్రౌండ్ చేసిన మటన్ ను ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చితరుగు, గరం మసాలా, బొప్పాయి తురుము వేసి కలపాలి.
3. అందులోనే తగినంత ఉప్పు, పెరుగు, నిమ్మరసం, తురిమిన కొత్తిమీర వేసి మిశ్రమాన్నంతటిని బాగా మెత్తగా కలుపుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేస్తూ ఒక్కో ఉండనూ చిన్నగా ఒత్తి, పాన్ మీద వేసి అటు, ఇటు రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని (ఉండలన్నింటిని )కాల్చుకోవాలి.
5. తర్వాత కోడిగుడ్ల సొనలో ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి గిలకొట్టి ఓ గరిటెడు మిశ్రమాన్ని పెనం మీద పలుచని ఆమ్లెట్ లా వేయాలి. ఇప్పుడు అందులో ముందుగా కాల్చిపెట్టుకొన్న మటన్ కబాబ్ ను పెట్టి, దాన్ని ఆమ్లెట్ తో మూసేసి, రెండు వైపులా బాగా కాల్చుకొని, ఒక సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి. ఇలా అన్ని కబాబ్ లను తయారు చేసుకోవాలి. అంతే రంజాన్ వేళ బహు పసందు వేళ, వేడివేడి అండా కబాబ్ రెడీ...

English summary

Anda Kabab-Ramzan Special

Egg Kebab is a very popular recipe. Learn how to make/prepare Egg Kebab by following this easy recipe.Egg Kebab Recipe Kebab made with minced lamb and eggs.
Story first published: Wednesday, July 17, 2013, 16:56 [IST]
Desktop Bottom Promotion