హాట్ అండ్ స్వీట్ డ్రెస్సింగ్ తో ఫ్రూట్ సలాడ్ ...!!

Posted By:
Subscribe to Boldsky

నాజూకుగా అవ్వాలని పట్టుదలతో ఉన్నారా??అలా అయితే మీకు ఆరోగ్యకరమైన మరియూ ఫ్యాట్ ఫ్రీ డైట్ కావాలి.ఇలాంటప్పుడు ఫ్రూట్ సలాడ్ ఒక మంచి ఎంపిక.

రోజుకొక ఫ్రూట్ తినాలనిపించకపోతే ఫ్రూట్ సలాడ్ మంచి తీసుకుంటే చాలా మంచిది.దీనిని మరింత రుచికరంగా చేసుకోవాలనుకుంటున్నారా?? అలా అయితే మామూలు ఫ్రూట్ సలాడుకే చిన్న మార్పు చేసి రుచికరంగా మార్చుకోగలగడమెలాగో ఇచ్చాము.

ఇంతకీ ఆ చిన్న మార్పు ఏమిటి అనే కదా మీ సందేహం.డ్రెస్సింగ్ లో క్రొత్తదనం అంతే, తేనే మరియూ పండు మిర్చితో.వావ్,తియ్య తియ్యగా కారం కారంగా..

ఊహించుకుంటేనే యమ్మీ అనిపించడం లేదూ?? ఇంతకీ ఈ డ్రెస్సింగ్ తో సలాడ్ ఎలా చేసుకోవాలో క్రింద చదివి తెలుసుకోండి.

ఎంత మందికి సరిపోతుంది-ఒక బౌల్ నిండా వస్తుంది

ప్రిపరేషన్ టైం-20 నిమిషాలు.

కావాల్సిన పదార్ధాలు:

1.తొక్కు తీసి సన్నగా తరిగిన పైనాపిల్-1/2 కప్పు.

2.మీడియం సైజ్ ఆరెంజ్-1

3.మీడియం సైజ్ పేర్-1

4.క్రష్ చేసిన వాల్ నట్స్-1/4 కప్పు

5.లెట్యూస్ ఆకులు-4

6.తేనె-2 టేబుల్ స్పూన్లు

7.లెమన్ జెస్ట్-1 టీ స్పూన్

8.పండు మిర్చి-1

9.లెమన్ జ్యూస్-1 టేబుల్ స్పూను

10.నల్ల మిరియాలు-రుచికి తగినన్ని

11. ఉప్పు-తగినంత

తయారీ విధానం:

1.పండు మిరపకాయని తీసుకుని రెండు చేతుల మధ్యలో ఉంచి నలపండి. ఇలా చేస్తే గింజలు విడివడటం సులభం.

honey chilli fruit salad

2.ఇప్పుడు దానిని ఒక వైపు నుండి కోసి మళ్ళీ రెండూ చేతుల మధ్యలో పెట్టి నలిపితే గింజలు బయటకి వచ్చెస్తాయి అప్పుడు సలాడ్ కారంగా ఉండదు.

3.పండు మిరపకాయని చిన్నగా కోసి ఒక గిన్నెలో వేసి తేనే జత చేర్చాలి.

honey chilli fruit salad

4.అదే గిన్నెలో లెమన్ జెస్ట్, లెమన్ జ్యూస్, ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి.

5.ఇప్పుడు అన్నీ ఇంకోసారి బాగా కలిసేలా కలపాలి.

honey chilli fruit salad

6.స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసి దానిలో వాల్నట్స్ వేసి రోస్ట్ చెయ్యాలి. రోస్టింగ్ అవ్వగానే స్టవ్ కట్టెయ్యాలి.

7.పైనాపిల్, యాపిల్, ఆరెంజ్, పేర్ పళ్ళని మీకు నచ్చిన ఆకృతిలో కోసుకోవాలి.

honey chilli fruit salad

8.ఇప్పుడు ఈ పండ్ల ముక్కలని ఒక గిన్నెలో తీసుకుని ఇంతకుముందు తయారు చేసుకున్న డ్రెస్సింగ్ పైన చిలకరించి బాగా కలపాలి.

9.ఇప్పుడొక ప్లేట్లో లెట్యూస్ ఆకులని పేర్చి దానిలో సలాడ్ని పేర్చి పైన రోస్ట్ చేసిన వాల్నట్స్‌తో అలంకరించాలి.

honey chilli fruit salad

10.అంతే రుచికరమైన హనీ చిల్లీ ఫ్రూట్ సలాడ్ తయారు.

English summary

Awesome Fruit Salad Honey Chilli Recipe

If you want to lose weight and also want to have something yummy, then fruit salad with honey chilli topping is the best for you.
Story first published: Tuesday, November 15, 2016, 12:24 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter