For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాదం కా హల్వా: శ్రీక్రిష్ణ జన్మాష్టమికి స్పెషల్ రిసిపి

|

శ్రీక్రిష్ణ జన్మాష్టమి లేదా లార్డ్ క్రిష్ణ బర్త్ డే మరో రెండు, మూడు రోజుల్లో రాబోతున్నది . మరి ఈ శ్రీక్రిష్ణ జన్మాష్టమి మీరు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే, పాత వంటకాలనే ఈ సంవత్సరం కూడా ప్రయత్నించకుండా, ఒక కొత్త రిసిపిలను ప్రయత్నించి, శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగ వాతావరణంను మరింత గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకోండి . శ్రీక్రిష్ణునికి పాలతో తయారుచేసే ఏవంటలైనా సరే మహా ఇష్టం. అలాగే పాలతో తయారుచేసే స్వీట్స్ కూడా ఇష్టమే. మరి ఈ క్రిష్ణ జన్మాష్టమికి అటువంటి మిల్క్ స్వీట్ ఒకటి మీకోసం పరిచయం చేస్తున్నాము. బాదం హల్వా, దీన్ని నెయ్యి మరియు పాలతో తయారుచేస్తారు.

ఈ రిసిపిని చాలా ట్రెడిషినల్ గా తయారుచేసుకుంటారు. సహజంగా బాదం హల్వాను క్రిష్ణ జన్మాష్టమికి తయారుచేయరు అయితే స్పెషల్ గా ఉండటం కోసం అని ఇలాకూడా తయారుచేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్ ఇండియన్ స్వీట్ డిష్. దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. కాబట్టి మీరు కూడా ఈ బాదం హల్వాను తయారుచేసి, మీ కుటుంబ సభ్యులను సంతోషపరచండి.

Badam Ka Halwa: Janmashtami Spl Recipe

కావల్సిన పదార్థాలు:

బాదం: 1/2cup(రాత్రంతా నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి)
పంచదార: 1/2cup లేదా 3/4cup(రుచికి సరిపడా
పాలు: 1cup
నెయ్యి: 1/2cup
కుంకుమ పువ్వు: కొద్దిగా (పాలలో నానబెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పాన్ మొత్తం స్పెడ్ చేయాలి. అలా చేస్తే హల్వా పాన్ కు అంటుకోకుండా ఉంటుంది.
2. తర్వాత అదే పాన్ లో 1/4నీళ్ళు పోసి కాచాలి, తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో పంచదార వేసి, కరిగే వరకూ కలియబెట్టాలి.
3. తర్వాత అందులో బాదం పేస్ట్, మిగిలిన పాలు, కుంకుమపువ్వు కూడా వేసి మీడియం మంట మీద ఉడికించాలి. మొత్తం మిశ్రమాన్ని అడుగు అంటకుండా కలియబెడుతుండాలి.
4. మీడియం మంట మీద ఉడుకుతూ చిక్కబడుతున్నప్పుడు, పాన్ యొక్క చివర్లు డ్రై అవుతున్నట్లు కనబడుతుంది, అప్పుడు మిగిలిన నెయ్యి కూడా పోసి మరో 10 నిముషాలు కలియబెడుతూ ఉడికించుకోవాలి.
5. నెయ్యి పూర్తిగా హల్వా గ్రహిస్తుంది తర్వాత పాన్ చివర్లకూడా అంటుకోకుండా చేస్తుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కూడా మరికొద్దిగా నెయ్యి వేయడం వల్ల బాదం హల్వా చాలా సాఫ్ట్ గా మారుతుంది. హల్వా చరల్లబడిన తర్వాత, చక్కగా సెట్ అవుతుంది. అంతే బాదం హల్వాను చల్లగా లేదా రూం టెంపరేచర్లో సర్వ్ చేయాలి.

English summary

Badam Ka Halwa: Janmashtami Spl Recipe

Janmashtami or Lord Krishna's birthday is just round the corner. If you are tired of making the same old recipes every year, then we have some great ideas for you. Lord Krishna loved anything that was sweet and milky. So how about making badam halwa for the playful deity. You can try this easy badam halwa recipe for this Janmashtami.
Story first published: Wednesday, August 13, 2014, 12:24 [IST]
Desktop Bottom Promotion