For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాబేజ్ కట్ లెట్-హెల్తీ ఈవెనింగ్ స్నాక్

|

సాయంత్ర వేళలలో తినడానికి వివిధ రకాల స్నాక్స్ ఉంటాయి. కానీ, అన్నీ హెల్తీ స్నాక్స్ కాకపోవచ్చు. సాయంత్రవేళల్లో తీసుకొనే స్నాక్స్ ఆరోగ్యకరమైనవై మరియు రుచికరంగా ఉండే స్నాక్స్ లో క్యాబేజ్ కట్ లెట్ స్నాక్ ఒకటి.

క్యాబేజ్ ఆరోగ్యపరంగా కూడా చాలా సహాయపడుతుంది. అందుకే క్యాబేజ్ తో రుచికరమైన కట్ లెట్ తయారుచేసి ఇంటిల్లి పాదికి కొత్త రుచిని అందించవచ్చు. ఈ క్యాబేజ్ కట్ లెట్ ను తయారుచేయడం చాలా సులభం. మరియు త్వరగా తయారవుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

Cabbage Cutlet

కావల్సిన పదార్థాలు:
క్యాబేజీ: 1cup(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
బంగాళ దుంపలు: 2 (ఉడికించి, పొట్టుతీసి, మెత్తగా చిదిమిపెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కరివేపాకు: 5-6 (సన్నగా తరగాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp
చాట్ మసాలా: 1tsp
మైదా: 2tbsp
బ్రెడ్ ముక్కలు: ½cup
నూనె : డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1/2cup
నీటి ½ కప్

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తరుగు, ఉడికించుకొన్ని బంగాళదుంప, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా, అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత కలుపుకొన్న పిండిలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని, మీడియం సైజ్ ఉండలు తయారు చేసుకోవాలి. వీటిని అరచేతిలో పెట్టుకొని, కట్ లెట్ లా వత్తుకోవాలి.

3. తర్వాత మైదాపిండిలో సరిపడా నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా, జారుడుగా కలిపి పెట్టుకోవాలి.

4. తర్వాత ముందుగా వత్తిపెట్టుకొన్న కట్ లెట్ ను మైదాలో డిప్ చేయాలి.

5. తర్వాత ఒక వెడల్పు ప్లేట్ లో బ్రెడ్ పొడి వేసి మైదాలో డిప్ చేసుకొన్న కట్ లెట్ ను బ్రెడ్ పొడిలో అన్నివైపుల అద్దుకోవాలి(పొర్లించాలి).

6. తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె పోసి కాగిన తర్వాత బ్రెడ్ పొడిలో అద్దిన కట్ లెట్ ను కాగే నూనెలో వేసి, డీప్ ఫ్రై చేసుకోవాలి.

7. పదినిముషాల పాటు, మీడియం మంట మీద డీఫ్ ఫ్రై చేసుకొన్నాక వాటిని తీసి సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. అంతే వేడి వేడి క్యాబేజ్ కట్ లెట్ రెడీ. వీటిని పుదీనా చట్నీతో బ్రేక్ ఫాస్ట్ గా కూడా తినవచ్చు...

English summary

Cabbage Cutlet -Healthy Evening Sanck

Cabbage cutlet is a great option for breakfast. Especially if you have kids at home who are not too fond of vegetables on their plates. It is a great way to make them eat veggies. It is an easy recipe and if you have the ingredients ready at home, it hardly takes any time.
Story first published: Wednesday, September 4, 2013, 17:20 [IST]
Desktop Bottom Promotion