For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ - క్యారెట్‌ కేక్‌

మదర్స్ డే సందర్భంగా ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఒక డిఫరెంట్ కలర్ తో కేక్ తయారు చేసే మదర్స్ ను ఇంప్రెస్ చేయాలంటే ఈ క్యారెట్ కేక్ ప్రయత్నించివచ్చు. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. క్యారెట్ లోని విటమిన్ ఏ ఆరోగ్యాన

|

కేక్ అనేది ఆడంబర పూర్వక ఉత్సవాలు, ప్రత్యేకంగా వివాహాలు, వార్షికోత్సవాలు మరియు పుట్టినరోజుల్లో భోజనాల్లో వడ్డించే డెజర్ట్ పదార్ధంగా చెప్పవచ్చు. ప్రస్తుతం లెక్కలేనన్ని కేక్ వంటకాలు ఉన్నాయి; కొన్ని రొట్టె వంటి పదార్ధాలు, కొన్ని అద్భుతమైన రుచి మరియు అలంకరణలతో అందుబాటులో ఉన్నాయి మరియు పలు రకాలు దశాబ్దాల చరిత్రలను కలిగి ఉన్నాయి. కేక్ తయారీ ప్రస్తుతం క్లిష్టమైన పని కాదు; ఒకానొక కాలంలో కేక్ తయారీ (ప్రత్యేకంగా గుడ్డు సొనను చిలకడం) చాలా శ్రమతో కూడిన పనిగా భావించేవారు, ప్రస్తుతం అనుభవం లేనివారు కూడా అద్భుతంగా కేక్ తయారు చేయడానికి వీలుగా బేకింగ్ సామగ్రి మరియు సూచనలు సరళీకృతం చేయబడ్డాయి.

మరి మదర్స్ డే సందర్భంగా ఒక డిఫరెంట్ టేస్ట్ తో ఒక డిఫరెంట్ కలర్ తో కేక్ తయారు చేసే మదర్స్ ను ఇంప్రెస్ చేయాలంటే ఈ క్యారెట్ కేక్ ప్రయత్నించివచ్చు. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. క్యారెట్ లోని విటమిన్ ఏ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండీ కేక్ గురించి తెలుసుకుందాం...

Carrot Cake

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: 2
వెన్న: 1/2cup
కొబ్బరి తురుము: 1cup
అక్రోట్ ముక్కలు: 1cup
ఎండుద్రాక్ష: 1cup
క్యారెట్‌ తురుము: 3cups
దాల్చినచెక్కపొడి: 1tsp
జాజికాయ పొడి: 1tsp
అల్లంపొడి: 1tsp
బ్రౌన్‌ షుగర్‌ (ముడి పంచదార): 1cup
మైదాపిండి: 2cups
బేకింగ్‌సోడా: 1tsp
ఆరెంజ్‌ జ్యూస్‌: 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, మసాలా పొడులు, బేకింగ్‌ సోడా, బ్రౌన్‌ షుగర్‌, వాల్‌నట్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్లు వేసి గిలకొట్టాలి.
2. తర్వాత విడిగా ఓ పాన్‌లో వెన్న వేసి కరిగిన తరవాత బంగారువర్ణంలోని ఎండుద్రాక్ష, క్యారెట్లు, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసి కలిపి వెంటనే దించి మైదా మిశ్రమంలో వేసి కలపాలి.
3. తరవాత గిలకొట్టిన గుడ్డు మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్‌ టిన్‌లో వేసి సుమారు గంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్‌ చేయాలి. చిన్న టూత్‌పిక్‌తో ఉడికిందో లేదో చూసి బయటకు తీయాలి. బయటకు తీసిన తరవాత ఐసింగ్‌ చేసి అందిస్తే బాగుంటుంది. మదర్స్ డే రోజున మీ మదర్స్ ను సర్ ప్రైజ్ చేయండి.

English summary

Carrot Cake Recipe for Mothers Day Special |మదర్స్ డే స్పెషల్ - క్యారెట్‌ కేక్‌

This is a great carrot cake recipe that is easy to make. It calls for self-raising flour, carrots, walnuts and cinnamon - no other spices, pineapple, raisins, etc. The Cream cheese icing is also easy to make and really delicious.
Desktop Bottom Promotion