For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాండ్ విచ్ - క్యారట్ మంచూరియన్

|

బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారట్స్‌లో కొలవాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే గంటకో క్యారట్ తినాలి. క్యారట్స్‌లో పోషకాలు పుష్కలం. కంటికి, ఒంటికి మేలు చేసే గుణాలు మెండు. రోజూ వంటలోకి ఓ క్యారట్ తురిమి వేయండి. ఇంకో క్యారట్‌ను తరిగి వండండి. నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. వేయించకుండానే పెరుగులో కలిపేయండి. దేనికది భిన్నమైన టేస్ట్ అంటూ లొట్టలు వేయంచండి. క్యారట్‌తో వివిధ రకాల వెరైటీలు వండుతారు. అందులో ఒకటి కొత్తరకం వంటకం క్యారెట్ మంచూరియన్.

తినడానికి టేస్ట్ గా స్పైసీగా..చూడటానికి నోరూరించే క్యారెట్ మంచూరియన్ తయారు చేయడం చాలా సులభం. మరియు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది. మరి పోషకాల శరీరానికి మెండుగా అందాలంటే క్యారెట్ ను రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే..క్యారెట్ తో ఓ వెరైటీ వంటకం క్యారెట్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Carrot manchurian Sandwich

కావలసిన పదార్థాలు:
తురిమిన క్యారట్: 1cup
శనగపిండి: 2cups
కార్న్‌ఫ్లోర్: 1tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: తగినంత
వాము: చిటికెడు

పోపు కోసం:
నూనె: కొద్దిగా
ఉల్లిపాయ తరుగు: 1tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
సోయాసాస్: 1tsp
టొమాటో సాస్: 1tsp
కొత్తిమీర తరుగు: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లిపేస్ట్, ఉప్ప, కారం, వాము వేసి కలపాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి, ముద్ద చేసుకోవాలి.

2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.

3. ఇప్పుడు పిండి ముద్దలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేసి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి.

4. మరొక పాన్ మరికొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయలు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి గ్రేవీలాగా చేయాలి.

5. తర్వాత వేయించిన క్యారట్ మంచూరియాలను అందులో వేసి బాగా మిక్స్ చేసి పక్కకు దింపుకోవాలి.

6. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ మంచూరియన్ రెడీ .

English summary

Carrot manchurian Sandwich | సాండ్ విచ్ - క్యారట్ మంచూరియన్

The Manchurian serves traditional and Modern Chinese and Cantonese food. Manchurians are deep fried vegetable balls in a soya sauce based gravy. Machurian balls mainly consists of cabbage, carrots and onions.
Story first published: Wednesday, May 22, 2013, 17:00 [IST]
Desktop Bottom Promotion