For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాక్లెట్ మోదక్: గణేష్ చతుర్థి స్పెషల్

|

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.
'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మహారాష్ట్ర లో వినాయకుడికి తప్పనిసరిగా చేసేది మోదక్. ఇవి దాదాపు మన కుడుముల్లాగే ఉంటాయి. మరి వినాయక చవితి వంటలో మోదక్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Celebrate Ganesh Chaturthi With Chocolate Modak

కావల్సిన పదార్థాలు:
బియ్యం పిండి: 1cup
నూనె: 1tsp
ఉప్పు: చిటికెడు
స్టఫింగ్ కు కావల్సిన పదార్థాలు:
చాక్లెట్ సిరఫ్: 1/4cup
కుక్కింగ్ చాక్లెట్ తురుము: 1/2cup
కొబ్బరి తురుము: 3/4cup

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి మరిగేటప్పుడు అందులో ఉప్పు మరియు నూనె వేసి, బాగా మరిగించాలి.
2. నీరు మరగుతున్నప్పుడు, అందులో బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు కంటకుండా బాగా మిక్స్ చేయాలి.
3. తర్వత మూత పెట్టి మంటను మీడియంకు తగ్గించి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి.
4. పూర్తిగా ఉడికించుకోవాలి. అవసరం అయితే, మరికొన్ని నీటిని చిలకరించి, తిరిగి మూత పెట్టి, ఆవిరి పూర్తిగా తొలగిపోయే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఒక పెద్ద ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారక ముందే అరచేతులకు నూనె రాసుకొని, కొద్దిగా పిండి చేతిలోకి తీసుకొని సున్నితంగా ఉండలు చుట్టుకోవాలి.

స్టఫింగ్ కోసం తయారుచేసే విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, చాక్లెట్ సిరఫ్ మరియు కుకింగ్ చాక్లెట్ తురుము అన్నింటిని వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
2. ఇప్పుడు మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసి, బియ్యం పిండి ఉండను చేతిలోకి తీసుకొని చేత్తో ఫోటోలో చూపిన విధంగా పల్చగా ఒత్తుకోవాలి .
3. తర్వాత నిధానంగా అందులో కొబ్బరి మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయాలి. ఫోటోలో చూపిన విధంగా మోదక్ లను మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
4. చివరగా వీటిని ఇడ్లీ ప్లేట్స్ లో పెట్టి ఆవిరి మీద ప్రెజర్ కుక్కర్ లో ఉడికించుకోవాలి. విజిల్ పెట్టకుండా 10-12నిముషాలు పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే చాక్లెట్ మోదక్ రెడీ . ఈ రుచికరమైన చాక్లెట్ మోదక్ వంటను రోజులో ఎప్పడైనా తినవచ్చు.

English summary

Celebrate Ganesh Chaturthi With Chocolate Modak

It is time of the year to prepare Ganesha's favourite sweet dish - modak. However, this time Boldsky wants to please your taste buds by adding chocolate to the filling. Every year, Hindus place this yummy modak dish at the feet of Ganesha on the occasion of his birthday. This year, we plam to make the festival of Ganesh Chaturthi a lot more special with the touch of chocolate.
Story first published: Tuesday, August 26, 2014, 12:02 [IST]
Desktop Bottom Promotion