For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చట్ పాటి హరియాలి టిక్కి రిసిపి

|

ప్రస్తుతం శీతాకాలం మొదలైంది. మార్కెట్లో వివిధ రకాల వెరైటీ వెజిటేబుల్స్ తో నిండి ఉంది. వింటర్ వెజిటేబుల్స్ క్యారెట్, టర్నిప్స్, ముల్లంగి, పచ్చిబఠానీ,మొదలగునవి. ఈ వెజిటేబుల్స్ తో వివిధ రకాలుగా వంటలు వండవచ్చు . ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రీన్ పీస్ మరియు ఆకుకూరలతో స్నాక్ రిసిపిని తయారుచేసుకోవచ్చు .

చట్ పాటి హరియాలి టిక్క, ఒక ట్యాంగీ స్నాక్. వీటిని వెజిటేరియన్స్ ప్రయత్నించవచ్చు. ఈ అద్భుతమైన రుచికలిగి ఈ స్నాక్ రిసినిపి రెండు హెల్తీ పదార్థాలైన గ్రీన్ పీస్, మరియు ఆకుకూరలతో తయారుచేయవచ్చు. మరి టేస్టీ ఈవెనింగ్ స్నాక్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Chatpati Hariyali Tikki Recipe

కావల్సిన పదార్థాలు:
ఆకు కూర: ½కట్ట
గ్రీన్ బటానీలు: 1cup(ఉడికించినవి)
బంగాళ దుంపలు : 2 (ఉడకబెట్టి మరియు పొట్టు తొలగించి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: ½ అంగుళం(తురుముకోవాలి)
కార్న్ ఫ్లోర్: ½ cup
చాట్ మసాలా: 1tsp
వేగించిన జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర: 2tbsp (చిన్న ముక్కలుగా కత్తిరించి)
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూర నుండి ఆకులను ఒలిచి బాగా శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్ళు,కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంట మీద ఒక 10నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి.
2. పది నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, నీరు వంపేసి పక్కన పెట్టుకవోాలి.
3. తర్వాత ఉడికించ బంగాళదుంపలను, ఉడికించిన పచ్చిబఠానీ, ఉడికించిన ఆకుకూర, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఛాట్ మసాలా, రోస్ట్ చేసిన జీలకర్ర పొడి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, అన్ని ఒక బ్లౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఈ మిశ్రమం మొత్తాన్ని 8-10 సమభాగాలు చేయండి.
5. తర్వాత ఒక్కొక్క బాల్ చేతిలోకి తీసుకొని అరచేతిలో పెట్టుకొని, ఫ్లాట్ గా వడలాగా కొద్దిగా మందగా వత్తుకోవాలి. దీన్నే టిక్కీ అంటారు.
6. మిగిలిన బాల్స్ అన్నీ కూడా ఇలా టిక్కీలా వత్తుకోవాలి.
7. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి, వేడిచేయాలి, కాగే నూనెలో వత్తి పెట్టుకొన్న టిక్కీలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి అంతే వేడి వేడి చట్ పాటి హరియాలి చికెన్ రెడీ .వీటిని కొత్తిమీర, లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.

English summary

Chatpati Hariyali Tikki Recipe

Winter is just round the corner and the market is loaded with the variety of vegetables. The winter vegetables like carrots, turnips, radishes, green peas etc. are simply a treat to the senses.
Story first published: Friday, November 22, 2013, 17:22 [IST]
Desktop Bottom Promotion