For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ ఫ్రూట్ కేక్/ప్లమ్ కేక్

|

క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.

క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావల్సిన పదార్థాలు:
పండ్లను రమ్ లేదా బ్రాందిలో నానబెట్టాలి: 3cups
కరమెల్ కు కావల్సినవి:
షుగర్: 1cup
నీళ్ళు: 1cup
కేక్ కోసం కావల్సినవి:
మైదా: 2½ cup
ఇన్స్టాంట్ కాఫీ పొడి: 1tsp
బేకింగ్ పౌడర్: 2tsp
దాల్చిన చెక్క పొడి: 1tsp
లవంగం పొడి: 1tsp
ఏలకులు పొడి: ½tsp
జాజికాయ పొడి: ½ tsp
ఉప్పు: ¼ tsp
ఉప్పులేని వెన్న: 1cup
డార్క్ బ్రౌన్ షుగర్: 1 ½ cup(ప్యాక్)
గుడ్లు -5
వెనిలా సారం: 2tsp
పంచదార పాకం 1cup
రమ్ లో నానబెట్టికొన్న పండ్లు: 3cups
రమ్: 2tsp

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

1. ముందుగా పాన్ లో షుగర్ తీసుకోవాలి.

2. ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, పంచదార బాగా పూర్తిగా కనగనివ్వాలి. స్పూన్ ఉపయోగించకూడదు.

3. పంచదార బాగా కరిగి కొద్దిగా బ్రౌన్ కలర్ కు మారేవరకూ అలాగే ఉంచండి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

4. పంచదార బ్రౌన్ కలర్ కు మారగనే పాన్ స్టౌ మీద నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. తర్వాత అందులో నీళ్ళు పోయాలి, స్పూన్ తో నిధానంగా బాగా మిక్స్ చేయాలి. తిరిగి ఒక నిముషం ఉడికించుకోవాలి.

6. తర్వాత స్టౌ మీద నుండి దించి, ఈ కరమెల్ ను చల్లారనివ్వాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

7. ప్లమ్ కేక్ తయారుచేయడం : ఓవెన్ ను 160డిగ్రీ సెం హీట్ పెట్టాలి.

8. తర్వాత అందులో లైట్ 2 వరకూ గ్రీజ్ లైన్ 2, 8x2అంగుళం ఉన్న పాన్ (మీరు సింగల్ టేలర్ పాన్ నుకూడా ఉపయోగించవచ్చు, కానీ బేకింగ్ సమయం ఎక్కువ తీసుకుంటుంది)

9. ఇప్పుడు ఒక బౌల్లో మైదా, కాఫీ పౌడర్, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి మరియు సాల్ట్ ను వేసి మిక్స్ చేయాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

10. తర్వాత బట్టర్ మరియు షుగర్ ను ఒక బౌల్లో వేసి ఎలక్ట్రిక్ బీటర్ తో బాగా గిలకొట్టాలి.

11. తర్వాత తర్వాత గుడ్డు పగలగొట్టి అందులో పోసి మరో గిలకొట్టాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

12. అలాగే వెలనీ సారం, కరమెల్ కూడా వేసి గిలకొట్టాలి.

13. ఇప్పుడు అందులో డ్రై మక్స్సర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

14. నానబెట్టుకొన్న పండ్లను రసాన్ని కూడా అందులో వంపుకోవాలి. తయారుచేసిన బాటర్ ను తయారుచేసే పాన్ లో పోయాలి.

15. ఇప్పుడు 55-60నిముషాలు టూత్ పిక్ క్లీన్ గా బయటకు వచ్చే వరకూ బేక్ చేయాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

16. తర్వాత కేక్ పాన్ ను చల్లారనిచ్చి, పాన్ నుండి పక్కకు తీసుకోవాలి.

17. ఇప్పుడు కేక్ మీ అక్కడక్కడ చిన్న చిన్న రధ్రాల్లా పెట్టి అందులో రమ్ ను చిలకరించాలి.

18. ఇప్పడు దీన్ని మూత గట్టిగా ఉండే బాక్స్ లో పెట్టాలి. ఈ కేక్ ను బేక్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Christmas Fruit Cake/Plum Cake

Christmas in my family is not complete without this traditional Fruit cake or as commonly called plum cake.
Story first published: Saturday, December 14, 2013, 11:58 [IST]
Desktop Bottom Promotion