For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి లడ్డు -నవరాత్రి స్పెషల్

|

ఏ ఇండియన్ ఫెస్టివల్ అయినా సరే స్వీట్స్ లేకుండా పండుగ జరగదు. వసంత నవరాత్రి ప్రారంభమైంది. ఉపవాసం ఉండే ఈ రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో వంటను రుచిచూడవచ్చు. ఉపవాసంలో టేస్టీ మరియు హెల్తీ రిసిపిలను తయారుచేసుకోవచ్చు.

మార్కెట్లో కొని తెచ్చుకొనే స్వీట్స్ కంటే ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసుకొనే స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే కాదు, చాలా సులభం కూడా. స్వీట్స్ అనగానే చాలా మందికి లడ్డులు హాట్ ఫేవరెట్. ఇందులో ముఖ్యమైన విషయంఏంటంటే, లడ్డులను చాలా త్వరగా తయారుచేయవచ్చు. అడ్డుల్లో కొబ్బరి లడ్డు ఒకటి.

Coconut Ladoo With Condensed Milk Recipe
కావల్సిన పదార్థాలు:
కొబ్బరి లడ్డు: 2cups(తురుముకోవాలి)
చిక్కటి పాలు: 2cups(బాగా మరిగించి వెన్న తీసిన పాలు)
పంచదార: 1cup
యాలకుల పొడి: 1tsp
బాదం: 4-5
బట్టర్: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కండెన్డ్ పాలను పోసి బాగా మరిగించాలి. 10 నిముషాల పాటు కాచాలి.
2. తర్వాత పాన్ అడుగున అంటుకోకుండా మద్యమద్యలో కలియబెడుతుండాలి.
3. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. పాలు కొబ్బరి తురుముతో బాగా మిక్స్ అయ్యే వరకూ కలియబెడుతూ ఉడికించుకోవాలి.
4. ఇలా 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార పూర్తిగా కరిగి పోయినప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి.
6. తర్వాత అందులో యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత చేతులకు బట్టర్ రాసి పాలల్లో ఉడికించిన కొబ్బరిని వేడిగా ఉన్నప్పుడే గుండ్రంగా ఉండలు చుట్టాలి.అంతే కండెన్డ్స్ మిల్క్ లడ్డు రెడీ.

English summary

Coconut Ladoo With Condensed Milk Recipe

Any Indian festival is incomplete without sweets. As the Vasant Navratri has started, there are many ways in which you can enjoy every day of the fasting by indulging in some tasty vrat recipes. You can opt to buy sweets from the market.
Story first published: Friday, April 4, 2014, 18:19 [IST]
Desktop Bottom Promotion