చిల్డ్రన్స్ డే రోజున కాఫీ కుకీస్ తో పిల్లలను సర్ ప్రైజ్ చేయండి...

Posted By:
Subscribe to Boldsky

హ్యాపీ చిల్డ్రన్స్ డే... ఈ రోజు బాలల దినోత్సవం. ఈ రోజు పిల్లలంతా చాలా ఉత్సహాంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు పిల్లలను మరింత ఉత్సహాంగా ఉండటం కోసం వారికి ఇష్టమైన మిఠాయిలు పంచుతూ వారికి ఇష్టమైన వంటలను వండి పెడితే వారు చాలా సంతోషిస్తారు. పిల్లలకోసం ఈ చిరుతిండి తయారు చేసి వారు ఇంటికి రాగానే చాక్లెట్ కుకీస్ తో సర్ప్రైజ్ చేయండి.

Coffee Cookies

కావల్సిన పదార్థాలు:
మైదా: 1.5cups
బట్టర్: 50grms
పంచాదార పొడి: 4tbsp
కాఫీ పౌడర్ (ఇన్ స్టాంట్ కాఫీ): 2tbsp
వెన్నీల ఎసెన్స్: 4 drops
ఎగ్ వైట్: 2
కొబ్బరి తురుము: ½ cup
ఉప్పు: చిటికెడు
బేకింగ్ సోడా: 1tsp
బేకింగ్ మోల్డ్స్(బేక్ చేయడానికి అచ్చులు): 20
బట్టర్ పేపర్: 1 sheet
వైట్ క్రీమ్: 1 cup

తయారు చేయు విధానం:
1. ముందుగా బటర్ ను వేడి చేసి కరగనివ్వాలి. తర్వాత ఒక బౌల్ లో కరిగించిన బట్టర్ మరియు పంచదార వేసి బాగా గిలకొట్టాలి.
2. తర్వాత అందులోనే ఎగ్ వైట్ మరియు వెనీలాఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఒక చిక్కటి ద్రవం తయారవుతుంది.
3. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మైదా, బేకింగ్ సోడా, కాఫీ పౌడర్ మరియు ఉప్పును వేసి బాగా అన్ని కలిసిపోయేలా కలగలపాలి.
4. తర్వాత ఈ మైదా మిశ్రమంలో ముందుగా తయారు చేసుకొన్న ఎగ్ మిశ్రమాన్ని వేసి, కొద్దిగా వేడినీళ్ళు కూడా చేర్చి మృదువుగా కలుపుకోవాలి.
5. ఇలా కలుపుకొన్న తర్వాత కొబ్బరి తురుమును కూడా చల్లుకొని బాగా కలుపుకోవాలి.
6. తర్వాత మైక్రోవోవెన్ ను 350 ఎఫ్ డిగ్రీవద్ద ఉంచి వేడిచేయాలి. మైక్రోవోవెన్ వేడి అయ్యేలోపు కుకీస్ అచ్చులో బట్టర్ రాసి తర్వాత ఈ పిండిని అందులో పోసి నింపుకోవాలి. నింపుకొన్న తర్వాత దాని మీద బట్టర్ పేపర్ తో కవర్ చేసి మైక్రోవోవెన్ లో పెట్టి 60శాతం పవర్ లో 5-10నిముషాల పాటు బేక్ చేయాలి.
7. పది నిముషాల తర్వాత మైక్రోవోవెన్ ఆఫ్ చేసి, కుకీస్ బాగా చల్లారనివ్వాలి. తర్వాత బయటకు తీసి వాటి మీద చాక్లెట్ కుకీస్ , వైట్ క్రీమ్ తో డెకొరేట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ చిల్డ్రన్ డే రోజున పిల్లలు ఇంటికి రాగానే చాక్లెట్ కుకీస్ తో సర్ప్రైజ్ చేయండి.

English summary

Coffee Cookies: Children's Day Treat | కాఫీ కుకీస్:చిల్డ్రన్స్ డే స్పెషల్

Want to give your kids a treat on Children's Day? Then here is a cookie recipe to get you started. Coffee cookies are the ideal recipe for kids because they have a strange emotional attachment with coffee. Kids like to do all things that are considered grown up. Drinking coffee is one of those many things that is restricted for kids.
Please Wait while comments are loading...
Subscribe Newsletter