For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీమీ మెకరోని కార్న్ చీజ్ బాల్స్ : హెల్తీ ఈవెనిగ్ స్నాక్స్

|

టీటైమ్ క్రిస్పీగా స్నాక్ ను చాలా మంది కోరుకుంటారు . ఎందుకంటే ఈ రెండూ ఎప్పుడూ బెస్ట్ కాంబినేషన్ . చీజ్ బాల్ పిల్లలకు చాలా ఇష్టం. చీజ్ బాల్స్ ను వివిధ రకాల పదార్థాలు జోడించి తయారుచేస్తారు . మెకరోని మరియు కార్న్ చీజ్ బాల్స్ ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఫ్రైడ్ ఇండియన్ స్నాక్ కార్న్ కెర్నెల్ మరియు చీజ్, మెకరోనితో కాంబినేషన్ తో తయారుచేస్తారు.

మెకరోనితో వివిధ రకాల వంటలను మీరు ట్రై చేసి ఉంటారు అయితే స్నాక్ లవర్స్ కు ఒది ఒక బెస్ట్ టీటైమ్ ట్రీట్. ఇది ఒక హై క్యాలరీ ఇండియన్ డిష్. ఈ మెకరోని చీజ్ బాల్స్ ను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. లోపల చీజ్, మెకరోని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డైట్ ప్లాన్ లో ఉంటే, మీరు ఫ్యాట్ ఫ్రీ చీజ్ ను ఉపయోగించాలి.

Creamy Macaroni & Corn Cheese Balls Recipe

కావల్సిన పదార్థాలు:
బట్టర్: 1tbsp
మైదా : 2 tbsp
పాలు: 1cup
మెకరోని: 1cup (ఉడికించినవి)
స్వీట్ కార్న్: 1/2cup
చీజ్: 1/4cup(తురుముకోవాలి)

Creamy Macaroni & Corn Cheese Balls Recipe

క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
ఎండు మిర్చి : 2tsp
బ్లాక్ మిరియాలు పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బ్రెడ్ పొడి: 1cup
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

Creamy Macaroni & Corn Cheese Balls Recipe

తయారుచేయు విధానంం
1. ముందుగా వైట్ సాస్ ను తయారుచేసుకోవాలి, పాన్ స్టౌ మీద పెట్టి, అందులో బటర్ వేసి వేడి చేసుకోవాలి తర్వాత అందులో మైదా వేసి కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి వెంటనే మొత్త మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఉండలు కంటకుండా చూసుకోవాలి.
2. ఇప్పుడు అందులో ఉడికించిన పాస్తా మరియు క్యాప్సికమ్ వేసి 5 నిముషాల ఉడికించుకోవాలి.
3. తర్వాత ఉప్పు, ఎండు మిర్చి, బ్లాక్ పెప్పర్ పొడి, స్వీట్ కార్న్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ, మరో 5 నిముషాలు ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే చీజ్ తురుము వేసి కరగనివ్వాలి. మొత్త మిశ్రమాన్ని కలగలుపుకొని, స్టౌ ఆఫ్ చేసి మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
5. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని 6-7సమభాగాలుగా చేసుకోవాలి. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

Creamy Macaroni & Corn Cheese Balls Recipe

6. ఇప్పుడు ఒక ప్లెయిన్ ప్లేట్ లో బ్రెడ్ పొడిని చిలకరించి అందులో మెకరోనీ బాల్స్ ను వేసి రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెకరోనీ బాల్స్ కు బ్రెడ్ పొడి అంటుకొని క్రిస్పీగా ఉంటాయి.
7. ఇలా అన్నింటిని రోల్ చేసి పక్కన పెట్టుకొన్న తర్వాత, డీప్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మెకరోని బాల్స్ ను వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
8. ఇలా తయారుచేసుకొన్న క్రీమీ మెకరోనీ కార్న్ బాల్స్ ను సర్వింగ్ ప్లేట్ లోనికి ట్రాన్స్ ఫర్ చేసుకొని, కెచప్ తో సర్వ్ చేయాలి.

English summary

Creamy Macaroni & Corn Cheese Balls Recipe

Tea time with crispy snacks is the best combination ever. Cheese balls seem to be a snack which most kids love to relish. Cheese balls can be made with many ingredients. Have you tried macaroni and corn cheese balls? This fried Indian snack can be a treat for the snack lovers. It is made with macaroni, corn kernels and cheese.
Story first published: Tuesday, March 3, 2015, 16:59 [IST]
Desktop Bottom Promotion