For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరకరలాడే కార్న్ పింగర్స్ స్నాక్స్: టీ టైమ్ స్పెషల్

|

సాయంత్రం వేళ వేడి వేడి ఒక కప్పు టీ లేదా కాఫీతో, కరకరలాడే ఫింగర్ చిప్స్ ఉంటే ఎంత బాగుంటుంది. చిప్స్ ను వివిధ రకాలుగా తయారుచేస్తారు. కానీ మొక్కజొన్నతో ఫింగర్స్ స్నాక్స్ తయారుచేస్తే రంగు మరియు రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ క్రిస్పీ స్నాక్ ను తయారుచేయడం చాలా సులభం. క్రిస్పీ కార్న్ ఫింగర్స్ ఒక అద్భుతమైన టీ టైమ్ స్నాక్.

చాలా మృదువుగా, కార్న్ ఫింగర్స్ లోపల మెత్తటి చీజ్ తో తయారుచేసే ఈ స్నాక్, తయారుచేయడం చాలా సులభం. కాబట్టి, సాయంత్రంలో ఈ క్రిస్సీ కార్న్ ఫింగర్ స్నాక్ తో పాటు ఒక కప్ప టీతో ఎంజాయ్ చేయండి.

Crispy Corn Fingers Recipe: Tea Time Snack

కార్న్ కెర్నలు: 1cup(ఉడికించి మరియు గుజ్జులా తయారుచేసుకోవాలి)
పాలు: 1cup
బంగాళ దుంపలు: 2 (ఉడికించి, పొట్టు తీసి, చిదిమి పెట్టుకోవాలి)
చీజ్ తురుము: 2tbsp
మైదా: 2tbsp
కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి): 1tbsp
పచ్చిమిరపకాయలు: 2(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పెప్పర్ పౌడర్: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పట్టుకోవాలి)
నీళ్ళు: ½cup
బ్రెడ్ ముక్కలు: ½cup
బటర్: 1tbsp
నూనె : డీప్ ప్రై చేయడానికి

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి, చిదిమి పెట్టుకొన్ని మొక్కజొన్న గుజ్జును అందులో వేసి, వెంటనే ఉప్పు, పాలు కూడా వేసి 6-7నిముషాలు మీడియం మంట మీద పాలు మొక్కజొన్న గుజ్జుకు బాగా పట్టి ఇంకిపోయే వరకూ ఉడికించుకోవాలి.
2.పాలు బాగా ఇంకిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోనికి మార్చి చల్లారనివ్వాలి.
3. చల్లారిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న బంగళదుంప, పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, చీజ్, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
4. చేత్తోనే బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మృదువుగా కలుపుకోవాలి.
5. ఈ పిండిలోనుంచి కొద్దికొద్దిగా తీసుకొని ఫింగర్స్ లా పొడవుగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత వాటిని రిఫ్రిజరేటర్ లో 15నిముషాలు పెట్టాలి.
6. తర్వాత డీప్ ప్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి.
7. అంతలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి, చిక్కగా..జారుడుగా కలుపుకోవాలి.
8. తర్వాత ఒక వెడల్పు ప్లేట్ లో బ్రెడ్ ను పొడి పొడి చేసి వేసుకోవాలి.
9. ఇప్పుడు ప్రిజ్ లో నుండి కార్న్ పింగర్స్ బయటకు తీసి మైదా, కార్న్ ఫ్లోర్ పిండిలో డిప్ చేసి(ముంచి), తర్వాత బ్రెడ్ పొడిలో వేసి అన్ని వైపులా బ్రెడ్ పొడి అంటుకొనే దొర్లించాలి.
10. ఇప్పుడు వీటిని కాగే నూనెలో వేసి నిదానంగా, మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ఐదు నిముషాలు డీప్ ప్రైచేసుకొని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించిపెట్టుకోవాలి.
11. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత వీటి, పేపర్ టవల్ మీద పర్చి, ఎక్సెస్ ఆయిల్ పేపర్ కు ఇంకిపోయోలా చేయాలి.
12.కార్న్ ఫింగర్స్ నుండి నూనె పేపర్ కు బాగా ఇంకిన తర్వాత, వాటిని సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొని, సర్వ్ చేయాలి. అంతే ఈవెనింగ్ టీతో నోరూరించి ఈ కార్న్ ఫింగర్స్ ను కెచప్ తో సర్వ్ చేస్తే అద్భుతంటా ఉంటుంది.

English summary

Crispy Corn Fingers Recipe: Tea Time Snack

How about some crispy corn fingers along with a steaming cup of coffee? Sounds great, isn't it? These crispy delights are quick and easy to prepare and gives that melt in the mouth feeling once you pop them in.
Story first published: Tuesday, September 17, 2013, 17:31 [IST]
Desktop Bottom Promotion