For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటుకుల (పోహా) కట్ లెట్ : ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

ఈవెంగ్ స్నాక్ రిసిపిలలో అటుకుల కట్ లెట్ ఒకటి. దీన్ని చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. కొన్ని మసాల దినుసులు ఉపయోగించి, ఆవిరి మీద ఉడికించి కట్ లెట్ ను వేడి నూనెలో వేసి క్రిస్పీగా తయారుచేస్తే చాలా రుచికరంగా క్రిస్పీగా ఉంటాయి.

పిల్లలకు హెల్తీ ఈవెనింగ్ స్నాక్స్ అందివ్వడానికి ఇలాంటి హెల్తీ స్నాక్స్ త్వరగా తయారుచేసి అందివ్వవొచ్చు. కాబట్టి, హెల్తీ అండ్ క్రిస్పీ పోహా స్నాక్ రిసిపిని ఎలా తయారుచేయాలో, అందుకు కావల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం....చిటికెలో అటుకుల కట్ లెట్ తయారుచేసేద్దాం....

Crispy Poha Croquette Recipe

కావల్సిన పదార్థాలు:
పోహ: 500grms
పెరుగు: 200grms
ఆవాలు: 1tsp
ఇంగువల: a pinch
నూనె: 3 tsbp
పచ్చిమిర్చి పేస్ట్ : 2 tbsp
కొబ్బరితురుము : ½ cup
కొత్తిమీర: ½ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పోహా(అటుకులను) నీళ్ళలో వేసి కడిగి పెరుగులో వేసి కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.
2. ఒక గంట తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, మరియు ఉప్పును పోహాలో వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి .
3. ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమంను కాస్రోల్ ట్రే మీద పెట్టి 3నిముషాలు వేడి చేయాలి. తర్వాత తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. ఆవిరి బాగా పట్టిన తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు ఒక నిముషం వేగనివ్వాలి.
5. తర్వాత ఆవిరి మీద ఉడికించుకొన్న పోహా కట్ లెట్ ను పాన్ లో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. ఫ్రై చేసుకొన్న తర్వాత వాటిని వేరుగా ఒక ప్లేట్ లోనికి తీసుకొని కొబ్బరి తురుముతో చిలకరించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా వడ్డిస్తే హెల్తీ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెడీ.

READ MORE: ఆలూ పోహా రిసిపి : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

READ MORE: లెమన్ పోహా-హెల్తీ లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

English summary

Crispy Poha Croquette Recipe

Poha is one of the lightest ingredients to start your morning with. You may have heard of poha and potato, poha upma and even poha idlis. What if this morning we told you, that it is possible to turn poha into a croquette? Yes, here is one of our favourite breakfast recipes you can indulge in this morning. The poha croquette recipe is not only easy, it also saves up on time.
Story first published: Wednesday, June 3, 2015, 16:37 [IST]
Desktop Bottom Promotion