For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరకరలాడే అనపగింజలు టైమ్ పాస్ స్నాక్...

|

సాధారణంగా అనపకాయలు పల్లెటూర్లలో పొలాల్లో దొరికేటటువంటి వెజిటేబుల్ సీడ్స్. ఇవి సంవత్సరంలో ఒక్కసారిమాత్రమే పండుతాయి. ముఖ్యంగా డిసెంబర్, జనవరిలో ఇవి లభ్యం అవుతాయి. ఈ అనపకాయలు ఆంధ్ర, కర్ణాటకాలో ఎక్కుగా పండిస్తారు. అనపకాయల నుండి గింజలను వేరు చేసి వీటిని వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. వివిధ రుచికరమైన వంటలు వండుతారు. అనపగింజల పులుసు, కుర్మా, పితికిపప్పు కూర, అనపగింజల దోసె, అనపగింజలమిక్చర్, అనగింజల పులావ్ ఇలా ఒకటేమిటి అనేకర రకాలుగా వండి ఆ సీజన్ అంతా కొత్త రుచితో ఎంజాయ్ చేస్తారు. మరి టైమ్ పాస్ కు తయారుచేసుకొనే హోం మేడ్ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దామా...

కావల్సిన పదార్థాలు:
అనపగింజలు: 4cups(అనపగింజలు నీటిలో నానబెట్టి పొట్టుతీసినవి/పితికి పప్పు)
కారం: 1-2tsp
పల్లీలు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా

Anapa Ginjalaa Mixture

తయారు చేయు విధానం:
1. ముందుగా అనపకాయల నుండి గింజలను వేరు చేసి 1-2గంటలపాటు నీటిలో నానబెట్టి గింజల పైపొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పితికి పప్పు అంటారు.
2. తర్వాత పాన్ లో పితికిపప్పు వేయించడానికి సరిపడా నూనె పోసి పితికిపప్పు తడిగా ఉండగానే నూనెలో వేసి ఒకటి రెండు నిముషాల పాటు వేయించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
3. అదే నూనెలో వేరుశెనగపప్పు(పల్లీలను) కూడా వేసి వేయించి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కరివేపాకు(అవసరం అయితే ఆవాలు వేసుకోవచ్చు)వేసి తర్వాత కారం, ఉప్పు వేసి ఒక నిముషం వేయించి అందులో ముందుగా వేయించి పెట్టుకొన్న అనపగింజలు, పల్లీలు, రుచికి సరడపడా ఉప్పు సరిచూసుకొని బాగా మిక్స్ చేయాలి. అంతే కరకరలాడే అనపగింజల మిక్చర్ రెడీ. గాలి చొరబడని డబ్బాలో వేసి, కావల్సినప్పుడు స్నాక్స్ గా పిల్లలకు పెద్దలకు అందించవచ్చు.

English summary

Crispy and Tasty Anapa Ginjalaa Mixture Snack | టైమ్ పాస్ స్నాక్-కరకరలాడే అనపగింజలు

These anapa kayalu are grown in fields in villages especially in Rayalaseema region. This is a seasonal crop and you can get them mostly in the months of December and January.
Story first published: Tuesday, January 8, 2013, 12:30 [IST]
Desktop Bottom Promotion