For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరకరలాడే రుచికరమైన షిఫ్ చిప్స్

|

సీఫుడ్ వెరైటీస్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు? అలాంటి వారికోసం ఒక డిఫరెంట్ షిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. ఫిష్ అండ్ చిప్స్ కాంబినేషన్ రిసిపి అద్భుతమైన టేస్ట్ తో నోరూరిస్తుంటుంది.

ఈ రిసిపి స్పెషల్ గా ఇంగ్లీస్ కంట్రీస్ నుండి సేకరించడం జరిగింది. ఇది సీఫుడ్ లవర్స్ కు అత్యంత ఇష్టమైన ఆహారం. ఈ డిష్ కు ముఖ్యంగా అవసరం అయినది చేపలు, కొన్ని మసాలా దినుసులు. ఈ రిసిపిని ఫిష్ అండ్ చిప్ అని పిలుస్తారు . దీన్ని డీప్ ఫ్రైడ్ షిఫ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫిష్ ఫ్రై క్రిస్పీగా మరియు క్రంచీ టేస్ట్ కలిగి ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Crunchy Yummy Fish And Chips Recipe


కావల్సిన పదార్థాలు:
చేపలు - 5 to 6
కారం - 1 teaspoon
బేకింగ్ పౌడర్ - 3/4th teaspoon
సోడా లేదా వైన్- 1 cup
మైదా- 1 tablespoon
కార్న్ ఫ్లోర్ - 1 tablespoon
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పిండిని తయారుచేసుకోవాలి. అందుకోసం మైదా, కారం, బేకింగ్ పౌడర్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

2. తర్వాత అందులో సోడా లేదా వైన్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.

3. మొత్తం మిశ్రమం ఒక 20నిముషాలు చల్లగా అవ్వనివ్వాలి.

4. తర్వాత అందులో ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

5. తర్వాత కార్న్ ఫ్లోర్ మరియు మైదాను ఒక ప్లేట్ లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి.

7. ఇప్పుడు ఈ చేప ముక్కలను సోడా లేదా వైన్ మిశ్రమంలో డిప్ చేయాలి.

8. ఇప్పుడుమరో పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగిన తరవ్ాత డిప్ చేసిన చేపముక్కలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

9. అంతే క్రిస్పీ ఫిష్ ఫ్రై రిసిపి రెడీ. వీటిని వేడి వేడిగా స్పైసీ సాన్ మరియు చిప్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Crunchy Yummy Fish And Chips Recipe

This recipe originally is from the English country, but it is quite famous among all the seafood lovers in India. As the name suggests, the main ingredient here is the fish. This recipe is called fish and chips, as chips are served along with the deep-fried fish.
Story first published: Saturday, January 23, 2016, 17:48 [IST]
Desktop Bottom Promotion