For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా కుకుంబర్ సూప్

|

సమ్మర్ వచ్చేసిందంటే చాలు, చల్లచల్లాగా పానీయాలు, కూల్ డ్రింక్స్, లస్సీ, మిల్క్ షేక్స్ వంటి వాటి మీద మనస్సు పడుతుంది. వేసవి దాహార్తి తీర్చుకోవడానికి కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాకపోవచ్చు. కాబట్టి, ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాలతో తయారుచేసే సూప్స్ లను కూడా వేసవిలో తీసుకోవచ్చు.

కీరదోసకాయతో తయారుచేసే పదార్థాలు ఏవైనా సరే జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో వేసి దిల్ లీవ్స్ కొన్నిరకాల స్కిన్ అలర్జీలకు మరియు శ్వాససంబంధిత సమస్యలకు చాలా మేలు చేస్తుంది. కాబట్టి, వేసవి వేడి నుండి తప్పించుకోవాలంటే, ఈ కూల్ కుకుంబర్ సూప్ ను ట్రై చేయండి..

Cucumber Chilled Soup To "Chill Pill" Summer

కావల్సిన పదార్థాలు:
కీరదోసకాయ: 2cups
ఉడికించిన వెజిటేబుల్స్: 1cup(బంగాళదుంప, క్యారెట్, బ్రొకోలీ)
నానబెట్టిన టోపికా పెరెల్స్ : 1cup(ఒక రకమైన సగ్గుబియ్యం వంటివి)
దిల్ లీవ్స్: 2tsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
మిరియాల పొడి: కొద్దిగా
వైన్ వెనిగర్: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: కొద్దిగా
చల్లటి నీళ్ళు: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పైన తీసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, బాగా ఉడికించాలి..
2. బాగా మిక్స్ చేసి, సర్వింగ్ బౌల్లో వేసి, హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా కుకుంబర్ సూప్ ను సర్వ్ చేయాలి.

English summary

Cucumber Chilled Soup To "Chill Pill" Summer

Chilled soups are back in trend as the summer season is up. Here is a tasty Cucumber chilled soup recipe that is best to relish in the hot summer season. Cucumber is good for digestion and dill leaves (a special ingredient in soup) is best for skin allergies and respiratory problems.
Story first published: Monday, April 14, 2014, 18:02 [IST]
Desktop Bottom Promotion