For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ బర్గర్ : దాబేలీ తయారీ..

By Lekhaka
|

ఇండియన్ స్టైల్ బర్గర్ లేదా సాండ్విచ్ రుచి చూడలనుందా?? ఇండియన్ స్టైల్ బర్గర్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారాఉ కదా?? ఈ రోజుల్లో అందరూ విదేశీ వంటకాలవైపు మొగ్గు చూపుతున్నారే కానీ అలాంటివే మనకీ ఉన్నాయనీ పైగా అవి ఆరోగ్యకరమైనవనీ గుర్తించడం లేదు.

అలాంటి సంప్రదాయ వంటకాలలో ఒకటి ఈ దాబేలీ. ఇది పిజ్జాలు, బర్గర్ల రుచిని మించిపోగలదు.గుజరాత్లోని అక్చ్ ప్రాంతం ఈ వంటకం యొక్క పుట్టిల్లు. ఎప్పుడైనా సాయంత్రాలు సరదాగా ఏదైనా విభిన్నంగా తిందామనుకుంటే కనుక దీనిని మీరు ప్రయత్నించవచ్చు.

ఇక ఈ దాబేలీ తయారీకి ఏమేమి కావలో ఎలా తయారుచెయ్యాలో చూద్దాము. కరకరలడే ఈ స్నాక్ అతిధులొచ్చినప్పుడు వడ్డించగలిగే మంచి స్నాక్.

ఎంత మందికి సరిపోతుంది-4

పాదార్ధాలు రెడీ చేసుకోవడానికి-15 నిమిషాలు

వండటానికి-25 నిమిషాలు

కావాల్సిన పదార్ధాలు:

స్టఫ్ఫింగ్ కోసం:

1.దాబేలీ మసాలా-1 1/2 టేబుల్స్పూన్

2.స్వీట్ చట్నీ-2 టేబుల్ స్పూన్లు

3.నూనె-1 టేబుల్ స్పూను

4.ఉడికించి చిదిమిన బంగాళ దుంపలు-1 1/4 కప్పు

5.సన్నగా తరిగిన కొత్తిమీర-2 తేబుల్ స్పూన్లు

6.తురిమిన కొబ్బరి-2 టేబుల్ స్పూన్లు

7.ఉప్పు-రుచికి తగినంత

8.దానిమ్మ గింజలు-2 టేబుల్ స్పూన్లు

ఇతర పదార్ధాలు:

9.దాబేలీ పావ్-4 స్లైసులు

10.మసాలా పల్లీలు-4 టీ స్పూన్లు

11.వెల్లుల్లి చట్నీ-4 టీ స్పూన్లు

12.సన్నగా తరిగిన ఉల్లి పాయలు-4 టీ స్పూన్లు

13.స్వీట్ చట్నీ-2 తేబుల్ స్పూన్లు

14.సేవ్(కారప్పూస)-4 టీ స్పూన్లు

15.వెన్న-2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

1. ఒక గిన్నెలో స్వీట్ చట్నీ , దాబేలీ మసాలా వేసి బాగా కలపాలి. కాస్త గట్టిగా అనిప్స్తే ఈ మిశ్రమానికి కాసిని నీళ్ళుచ్ హేర్చి పల్చగా చెయ్యాలి.

The Special Indian Burger

2.ఇప్పుడొక కడాయి స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడీ చేసి పైన కలిపిన మిశ్రమాన్ని వేసి వెంటనే బంగాళ దుంపలు , సరిపడా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.

The Special Indian Burger

3.దాబేలీ మసాలా తయారయ్యాకా ఒక ప్లేటులోకి తీసుకుని దాని మీద దానిమ్మ గింజలు, తురిమిన కొబ్బరి, కొత్తిమీర వేసి అలంకరించండి.

The Special Indian Burger

4.ఇపుడు దాబేలి పావ్‌ని తీసుకుని దానిని సగానికి కట్ చెయ్యండి. రెండు స్లైసులనీ పూర్తిగా విడదీయకూడదు.సూట్కేస్ ఎలా తెరుచుకుంటుందో అలా ఉండాలన్నమాట.

The Special Indian Burger

5.ఇప్పుడొక స్లైస్ మీద వెల్లుల్లి చట్నీ, స్వీట్ చట్నీ రాసి దాని మీద దాబేలీ మసాలా వెయ్యాలి.ఇప్పుడు రెండో స్లైస్ మీద కూడా వెల్లుల్లి, స్వీట్ చట్నీస్ రాయాలి. ఇప్పుడు దాబేలీ మసాలా ఉంచిన స్లైస్ మీద మసాలా పల్లీలు,సేవ్ వేసి రెండో స్లైస్ దీని మీద పెట్టాలి.

The Special Indian Burger

6.ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడీ చేసి దాని మీద వెన్న వేసి పైన తయారు చేసుకున్న దాబేలీ బ్రెడ్డుని రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.

The Special Indian Burger

7. అంతే మీ దాబేలీ రెడీ. వేడి వేడిగా మీ అతిధులకి దాబేలీని వడ్డించండి.

The Special Indian Burger

English summary

Dabeli: The Special Indian Burger

Do you want to taste the Indian version of a burger or as some may say, a sandwich? Surprised, right? Actually, today, people get so amused by the foreign food items that they forget there are plenty of dishes in India, which taste better than the usual fast foods, and are healthy too.
Desktop Bottom Promotion