For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

|

దసరా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు సంతోషంగా సందడిగా జరుపుకునే ఈ పండుగ భారత సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. ఉదయాన్నే మహిళలు లేచి ఇళ్ళు, వాకిళ్ళు కడిగి ముగ్గులు వేస్తారు. స్నానపానాదులు చేసి భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన దేవి మాతను కొలుస్తుంటారు.

నవరాత్రులు ఒక్కో రోజు.. ఒక్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. ప్రాంతాలు వేరైనా.. వంటలు వేరైనా వాటిని భక్తితో దేవికి నైవేద్యంగా పెడతారు. ఈ పండుగ రోజు వివిధ ప్రాంతాల్లో తయారు చేసుకునే రకరకాల వంటలను ఇక్కడ ఇస్తున్నాం.. కమ్మని వంటలతో దేవిని కొలవండి.. అతిథులకు విందు చేయండి..

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

కరకరలాడే కార్న్ పింగర్స్ స్నాక్స్

సాయంత్రం వేళ వేడి వేడి ఒక కప్పు టీ లేదా కాఫీతో, కరకరలాడే ఫింగర్ చిప్స్ ఉంటే ఎంత బాగుంటుంది. చిప్స్ ను వివిధ రకాలుగా తయారుచేస్తారు. కానీ మొక్కజొన్నతో ఫింగర్స్ స్నాక్స్ తయారుచేస్తే రంగు మరియు రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ క్రిస్పీ స్నాక్ ను తయారుచేయడం చాలా సులభం. క్రిస్పీ కార్న్ ఫింగర్స్ ఒక అద్భుతమైన టీ టైమ్ స్నాక్.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

బంగాళదుంప-పెసరపప్పు పకోడాబంగాళదుంప-పెసరపప్పు పకోడా

వర్షాకాలం మన మూడ్ ను చాలా వరకూ మార్చేస్తుంది. ఎలాగ అంటారా? త్వరగా నిద్రలేవనివ్వదు, వర్షానికి బయట కాలు పెట్టనివ్వదు, ఏమి తిన్నా రుచిగా అనిపించదు..ఇలాంటివి మరికొన్ని..ముఖ్యంగా వర్షానికి వేడి వేడి, కొంచెం కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. వానపడుతున్నప్పుడు, క్రిస్పీగా, స్పైసీగా తినాలనిపించే స్నాక్స్ తో పాటు ఒక కప్పు టీ, కాఫీ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

ఆంధ్ర స్టైల్ మసాలా వడ ఆంధ్ర స్టైల్ మసాలా వడ

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం..

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

ఉద్ది వడ సౌత్ ఇండియన్ స్పెషల్ఉద్ది వడ సౌత్ ఇండియన్ స్పెషల్

ఉద్దిన వడ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్. మరీ ముఖ్యంగా ఇడ్లీకి సైడ్ డిష్ గా చేస్తుంటారు. తింటుంటారు. ఇది చాలా సాధారణమైనటువంటి బ్రేక్ ఫాస్ట్ . ఇది సౌత్ ఇండియాలోనే కాక మొత్తం ఇండియాలోనే ఇడ్లీ, వడా చాలా ఫేమస్. ఉద్ది వడకు బ్లాక్ గ్రామ్ (ఉద్దిపప్పు)ను ఉపయోగిస్తారు.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

పనీర్ కట్ లెట్: పనీర్ కట్ లెట్:

వేడి వేడి కట్ లెట్, ఒక కప్పు టీ, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ !సంతోషకరమై సమయాన్ని గడపడానికి ఇంతకంటే మరేం కావాలి. వర్షాకాలంలో ఇలాంటి క్రిస్పీ వంటలు రుచి చూడటానికి మంచి సమయం. పనీర్ ఇటు వెజిటేరియన్ కు అటు నాన్ వెజిటేరియన్స్ కు ఇష్టమైన వంటకం. వారికోసం ఇక్కడ ఒక స్పైసీ-నోరూరించే క్రిస్పీ వంటకం. ఈ వంటకాన్ని వివిధ రకాలుగా వండుకోచ్చు. ఈ కట్ లెట్ ను డీప్ ప్రై చేసుకోవచ్చే లేదా బేక్ చేసుకోవచ్చు. ఈ వంటకానికి ఒక ప్రత్యేకత ఉంది. పనీర్ మిశ్రమాన్ని బ్రెడ్ పొడిలో డిప్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. మరి ఈ క్రిస్పీ కట్ లెట్ ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

చెన్నా ఛాట్: చెన్నా ఛాట్:

రోజూ రొటీన్ గా చేసుకునేకంటే కొంచెం వండటం మార్చి వండితే కొత్త రుచులను ఆస్వాధించవచ్చు. ఛాట్ ఐటమ్స్ ఏవైనా సరే అందరం ఇష్టంగా తింటాము. రొటీన్ గా చేసుకునే, బయట దొరికే చాట్ వంటకాలు కాకుండా కొంచెం భిన్నంగా తయారు చేసుకొనే వంటల్లో చాట్స్ కూడా ఒకటి. తక్కువ వస్తువులతో పుల్లపుల్లగా, కారంగా అప్పటికప్పుడు తయారుచేసుకునే చాట్ ఐటెమ్స్ చాలా ఉన్నాయి. ఇవి బయట మాత్రమే దొరుకుతాయి అనుకుంటే పొరపాటే. ఇంట్లో కూడా చాలా సులువుగా చేసుకోచ్చు.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

పెసరపప్పు సమోసా

ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా మంది స్త్రీలు ఉపవాస ధీక్షలు ఉంటారు. అందులో అల్పాహార ప్రియులు వుంటారు. వారికోసం ఈ చిరు వంటకం. సమోసా అంటే పిల్లలకు, పెద్దలకూ ఆల్ టైమ్ ఫేవరెట్ వంటకం. చూస్తా తినేయాలనిపించే సమోసాలంటే చూస్తానే తినేయాలని పిస్తుంది. సమోసాలలో వెరైటీలు ఉన్నాయి అందులో ఒకటి పెసరపప్పు సమోసా. పెసరప్పు ఆరోగ్యానికి మంచిది. మరియు దేహానికి చలువచేస్తుంది. సొటాటోలో న్యూట్రిషియన్స్, క్యాలరీలు, పిండిపదార్థాలు ఎక్కువగా లోఫాట్ కలిగి ఉంటాయి. రెండింటి కాంబినేషన్ తో చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచింది.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

వెజిటబుల్ పకోడా

నోరూరించేవి మాత్రమే కాదు, ఈ పకోడాలు కడుపు నిండేలా చేస్తాయి. వీటిని వివిధ రకాల పదార్థాలు పనీర్, ఉల్లిపాయ, వెజిటేబుల్ పకోడా వంటివి తయారుచేసుకుంటారు .

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

స్టఫ్డ్ బ్రెడ్ పకోడాస్టఫ్డ్ బ్రెడ్ పకోడా

వర్షాకాలంలో సాయంత్రపు చిరుజల్లుల్లో ప్రతి ఇంట్లోనూ వేడివేడిగా కాఫీతో పాటు, కారంగా ఏదైనా చిరుతిండ్లు చేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. మన ఇండియాలో వర్షాకాలం అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. వర్షాకాలంలో ఇంట్లో వారందరూ ఒక చోట చేరి వేడి వేడి కాఫీ, ఛాట్స్ తీసుకుంటు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఛాట్స్ అంటే ముఖ్యంగా బజ్జీ, పకోడా..పకోడాలో వివిధ రకాలున్నాయి. అందులో ఉల్లిపాయ పకోడా లేదా ఆలూ పకోడ లేదా బ్రెడ్ పకోడా ఇలా వివిధ రకాలు వర్షాకాలంలో ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే చిరుతిండ్లు.

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

10 టేస్టీ వెజిటేరియన్ స్నాక్స్-నవరాత్రి స్పెషల్

ఆలూ బోండాఆలూ బోండా

బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు. దక్షిణ భారత దేశంలో(కర్ణాటక, ఆంధ్ర) వీటి పేర్లు కూడా చాలా ఫేమస్. బోండాను చాలా రకాలుగా వండుతారు. ఆకు కూరలు, కూరగాయలు, లేదా ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమర్చి, బంగాళదుంప ఇలా చాలా రకాలు... ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....

English summary

Delicious Vegetarian Snacks For Navratri

Let us make these days of vegetarianism a bit colourful and interesting for you. Here we have some tasty snack recipes which you can have during these days of Navratri. Most of these snack recipes are simple and of Course they are all one hundred per cent vegetarian!
Story first published: Tuesday, October 8, 2013, 15:11 [IST]
Desktop Bottom Promotion