For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోసె పిండితో రుచికరమైన బోండాలు: ఈవెనింగ్ స్నాక్స్

|

బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు. దక్షిణ భారత దేశంలో(కర్ణాటక, ఆంధ్ర) వీటి పేర్లు కూడా చాలా ఫేమస్. బోండాను చాలా రకాలుగా వండుతారు. ఆకు కూరలు, కూరగాయలు, లేదా ఉల్లిపాయలు, వంకాయలు, బీరకాయలు, పచ్చిమర్చి, బంగాళదుంప ఇలా చాలా రకాలున్నాయి. వెరైటీగా ఈ రోజు లెఫ్ట్ ఓవర్ దోసెపిండితో బోండా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో బోండాలు చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....

Dosa Batter Bonda Recipe

కావల్సిన పదార్థాలు:
దోస పిండి : 1cup
బియ్యం పిండి : 1/2cup
ఉల్లిపాయ :1/2cup(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి : 2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పెప్పర్ : 1/2tsp
కొబ్బరి : 1tbsp(తురిమినది)
కరివేపాకు: 4 రెమ్మలు
కొత్తిమీర : 2tbsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : ఫ్రై చేయడానికి సరిపడా

1. ముందుగా లిస్ట్ లో ఇచ్చిన పదార్థాలలో నూనె మినహాయించి మిగిలిన పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి.
2. ఒక కడైలో నూనె పోసి, కాగినివ్వాలి.
3. నూనె వేడయ్యాక గరిట నిండా పిండి తీసుకొని కొద్దికొద్దిగా కాగే నూనెలో వేసుకోవాలి. చేత్తో కూడా పిండిని నూనెలో బోండాల్లా వేసుకోవచ్చు.
4. బోండాలు నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఇది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. బోండా క్రిస్పిగా వేగిన తర్వాత వాటిని తీసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. అంతే కమ్మని దోసెపిండి బోండాలు రెడీ...

English summary

Dosa Batter Bonda Recipe

It is past 4pm, so step into your kitchen to prepare this yummy recipe we are sharing with you. Dosa batter can now be transformed into a better treat as an evening snack. To prepare dosa batter into a bonda here is a simple recipe for you to follow.
Story first published: Saturday, February 28, 2015, 16:09 [IST]
Desktop Bottom Promotion