For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ-ట్రెడిషనల్ పంజాబ్ రిసిపి

|

పెరుగుతో తయారుచేసే డ్రింక్ ఐటమ్ మ్యాంగో లస్సీ ఒక పాపులర్ మరియు ట్రెడిషినల్ రిసిపి. ఇది ముఖ్యంగా పంజాబీల రిసిపి. అక్కడ బాగా ప్రసిద్ది చెందిన రిసిపి ఇది. ఏ రెస్టారెంట్ కు వెళ్లినా మ్యాంగో లస్సీ చాలా పాపులర్ గా ప్రతి రెస్టారెంట్ మెనులో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని పెరుగు మరియు మామిడి పండ్ల ముక్కలతో తయారుచేస్తారు . ఇంకా ఇందులో మీరు పంచదార, పాలు మరియు యాలకలు వేసి మరింత టేస్టీగా మరియు ఫ్లేవర్ గా తయారుచేసుకోవచ్చు. వేడి వాతావరణంలో రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది మద్యలో టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ను కూడా వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా మ్యాంగో లస్సీకి మంచి పాపులారిటీ ఉంది . ఇది యూఎస్, యుకె, మలేషియా, సింగరపూర్ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా చాలా ఫేమస్ .

ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు, ఇది హెల్తీ కూడా. పండ్లలో రారాజు ‘మామిడి' పండ్లు ఇందులో విటమిన్ ఎ, బి6, సి, ఇలు, మినిరల్స్, డైటరీ పైబర్, పోలీ ఫినోలిక్, ఫ్లెవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స కాంపౌడ్స్ పుష్కలంగా ఉండి, ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి.

Dry Fruit Mango Lassi-Traditional Punjab Recipe

కావల్సిన పదార్థాలు:
పెరుగు: 1cup
మామిడి పండు: 1(పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బాదం: 4-5(పొడి చేసుకోవాలి)
పిస్తా: 3-4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పంచదార: 3tsp
రోజ్ వాటర్ : రెండు మూడు చుక్కలు
ఐస్ క్యూబ్స్: 3-4

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకొని దాన్ని వాగా గిలకొట్టాలి.
2. తర్వాత బ్లెండర్ లో పెరుగు మరియు మామిడి పండు ముక్కలు, కొద్దిగా నీళ్ళు , పంచదార వేసి గ్రైండ్ చేయాలి.
3. మాండిపండ్లు బ్లెండ్ అయిన తర్వాత అందులో రోజ్ వాటర్ కూడా వేసి మరో రెండు మీరు సెకండ్లు బ్లెండ్ చేయాలి .
4. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని వేరే గిన్నెలోనికి వడగట్టుకోవాలి. మామిడి గుజ్జు ఫైబర్ తొలగిపోతుంది.
5. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, అందులో ఐస్ క్యూబ్స్ వేసి తర్వాత అందులో మ్యాంగో లస్సీపోయాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. మీకు అవసరం అనిపిస్తే బ్లెండ్ చేసేప్పుడు కూడా డ్రైఫ్రూట్స్ ను యాడ్ చేసుకోవచ్చు. అంతే డ్రై ఫ్రూట్ మ్యాంగో లస్సీ త్రాగడానికి రెడీ.

English summary

Dry Fruit Mango Lassi-Traditional Punjab Recipe

Mango lassi is a popular and traditional sweet yogurt-based drink, originates in the punjab region. It is made from yogurt and mango pulp. You may also add sugar, milk and cardamom for extra richness and flavoring. It is served chilled in a tall glass as a hot weather refreshment, often sprinkled with dry fruits and nuts on the top.
Story first published: Friday, May 30, 2014, 18:01 [IST]
Desktop Bottom Promotion