For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే చాకొలెట్ కేక్ రెసిపి

By Nutheti
|

సాయంత్రం అయిందంటే చాలు.. స్నాక్స్ కోసం బేకరీ ఐటమ్స్, రోడ్ సైట్ పానీపూరీలు, సమోసాలు తినాలనుకుంటారు చాలామంది. . కానీ.. ఇంట్లోనే నోరూరించే స్నాక్స్ రెడీ చేసుకుని తింటే ఆ మజానే వేరు. కేక్ అంటే అందరికీ ప్రీతికరమే.. అందులోనూ.. చాకొలెట్ కేక్ అంటే.. వావ్ అని లొట్టలేయాల్సిందే.

మీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే చాకొలెట్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. ఎగ్ ఇష్టపడని వాళ్లకోసం ఎగ్ లెస్ చాకొలెట్ కేక్ రెసిపి చూపిస్తున్నాం. వింటుంటేనే నోరూరిపోతోంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం.. చకచకా తయారు చేసి.. తినేయండి.

ఎగ్ లెస్ చాకొలెట్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
పాలు - 2 కప్పులు
చక్కెర - 1 కప్పు
వెన్న - 2 కప్పులు
కోకో పౌడర్ - 1 కప్పు
వెనీలా ఎక్ట్రాక్ట్ - 2 లేదా 3 టేబుల్ స్పూన్స్
బేకింగ్ పౌడర్ - అరకప్పు
బేకింగ్ సోడా - అరకప్పు
ఉప్పు

తయారుచేసే విధానం
ఒక గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు పాలు, కప్పు చక్కెర, 3/ కప్పు వెన్న అన్నింటిని బాగా కలపాలి. తర్వాత 4,5 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ బేకింగ్ సోడా, 2 1/2 కప్పుల మైదా తీసుకుని.. అన్నింటిని బాగా కలుపుకోవాలి. ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని.. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎక్ట్రాక్ట్ కలపాలి. అన్నీ బాగా కలిసే వరకు కలపాలి. మిశ్రమం మెత్తగా రావడానికి మరో అరకప్పు పాలు కలుపుకోవాలి.

తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకుని.. అందులో అరకప్పు ఉప్పు వేయాలి. తర్వాత ఒక టిన్ తీసుకుని దానికి లోపల భాగమంతా వెన్న రాయాలి. ఒక బటర్ పేపర్ తీసుకుని.. టిన్ లోపల పెట్టాలి. ఇప్పుడు దాన్లోకి.. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. కానీ విజిల్ మాత్రం పెట్టకూడదు. 30 నిమిషాల తర్వాత కుక్కర్ తీసి చూడండి.. వేడి వేడి.. నోరూరించే యమ్మీ చాకొలెట్ కేక్ రెడీ. ఇంకే అందరూ లొట్టలేసుకుంటూ లాగించేసేయండి.

English summary

Easy Eggless Chocolate Cake Recipe

Want to try something different? Something that is yummy and chocolatey? Then, today's recipe is just for you. We shall prepare eggless chocolate cake today. Hmmm, this cake just as the name says- irresistible. For all those who don't eat egg, you can surely try and make this chocolate eggless cake.
Story first published: Tuesday, September 29, 2015, 15:45 [IST]
Desktop Bottom Promotion