బూరెల్లో వెరైటీ-కేసరి బూరెలు

Enjoye With Kesari Boorelu Aid0069
కావలసిన పదార్థాలు...
బొంబాయి రవ్వ: 1/2kg
బియ్యంపిండి: 1cup
మైదా: 1cup
పంచదార: 2cups
యాలకులు: 4-6
ఫుడ్ కలర్‌: చిటికెడు
నూనె: వేయించడానికి తగినంత
ఉప్పు: చిటికెడు
జీడిపప్పు, ద్రాక్ష: 8:8

తయారు చేయు విధానం:

1. మొదటగా బొంబాయి రవ్వను జల్లించి, ఒక పాన్ లో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.
2. తర్వాత ఒక గ్లాసు నీళ్ళను బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో పంచదార, కలర్‌ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి, జీడిపప్పు, ద్రాక్ష వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.
4. తర్వాత బియ్యం పిండిని, మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత పాన్ లో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.
Posted by:
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .