For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చిబఠాణీ శాండ్ విచ్-పిల్లల పెరుగుదలకు హెల్తీ స్నాక్

|

సాధారణంగా ఇంట్లో పిల్లలుంటే ఏవేవో కొత్త కొత్త రుచులను కోరుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో నాకు నూడుల్స్ కావాలి. ఇవాల బర్గర్ తెచ్చుకోనా?కట్ లెట్ తినాలనుంది..ప్లీజ్..అమ్మా! అంటూ పిల్లలు మారం చేస్తుంటారు. సరే అందామా అంటే..బయటి ఆహారం..‘అమ్మో ఆరోగ్యం'అనిపిస్తుంది.

మరి అలాంటి భయాలను తీసేస్తూ..ఇంట్లోనే ఆ రుచుల్ని స్వయంగా చేసి పెట్టండి. పిల్లలు కోరుకునే రుచులు..మనం అందించాలనుకునే పోషకాల..రెండింటి మేళవింపే ఈ రుచులు..పిల్లల ఎదుగుదలకు పచ్చిబఠాణీలు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి కాబట్టి పచ్చిబఠాణీలతో మీ పిల్లలకు నచ్చే ఓ హెల్తీ ఈవెనింగ్ సాండ్ విచ్ తయారు చేసి ఇచ్చేయండి...

Green Peas Sandwich

కావల్సిన పదార్థాలు:
బ్రౌన్ బ్రెడ్ స్లైసులు: 8(కొద్దిగా వెన్న రాయాలి)
టమోటో: 1(పెద్దది/సన్నగా స్లైసుల్లా తరిగేయాలి)

ఫిల్లింగ్ కోసం :
ఉడికించి మెత్తగా చేసిన పచ్చిబఠాణీ పేస్ట్: 1cup
కొత్తిమీర తురుము: 1tbsp

టాపింగ్ కోసం:
గట్టి పెరుగు: 2tbsp
క్రీమ్: 1tbsp
ఆవపొడి, పంచదార: 1/2tspచొప్పున
టమోటో కెచప్: 2tsp
చిల్లీ సాస్: 1/2tsp
క్యాప్సికమ్ తరుగు: 1tsp
పచ్చిమిర్చి ముక్కుల: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా వెడల్పాటి గిన్నెలో పెరుగు, క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కలిపేస్త్ టాపింగ్ సిద్దం.
2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ మీద బ్రెడ్ స్లైసులను రెండు వైపులా దోరగా కాల్చాలి. ఒక్కో బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక్కోదానిపై టమాటా స్లైసులను ఉంచాలి. వాటి మీద కొద్దిగా ఉప్పు చిలకరించాలి.
3. తర్వాత ముందుగా సిద్దం చేసుకొన్న మిశ్రమాన్ని టాపింగ్ లా రాసి...మిగిలిన నాలుగు స్టైసులను వాటిపై ఉంచేయాలి. వీటిని త్రీకోణాక్రుతిలో లేదా గుడ్రంగా కట్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.
4. ఇందులో కార్బోహైడ్రేట్లు 34.6గ్రా, కొవ్వు: 3.1గ్రా, పీచు 2.4గ్రా, ఇనుము: 2.7మి.గ్రా, పొటాషియం 199.8గ్రా, మాంసక్రుత్తులు 7.7గ్రా, శక్తి 198కిలో కెలొరీలు

English summary

Green Peas Sandwich for Healthy Kids | పచ్చిబఠాణీ శాండ్ విచ్-పిల్లల పెరుగుదలకు హెల్తీ స్నాక్

Chock full of nutrients required for growth, green peas make a surprising filling for sandwiches!Green peas sandwich can be prepared in just 15-20 minutes.Green Peas Sandwich is a colourful and easy way to provide your skin with lots of protein and vitamin A.
Story first published: Tuesday, May 21, 2013, 17:28 [IST]
Desktop Bottom Promotion