For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి మేలు చేసే టమోటో పన్నీర్ బ్రేక్ ఫాస్ట్

|

ఆహారపు అలవాట్లలో మధ్యహ్నా భోజనం, రాత్రి తీసుకొనే డిన్నర్ కంటే ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా విలువైనది. అది ఆరోజంతా ఉత్సహాంగా ఉండేలా చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం మంచిదని, చాలా మంది డైటీషియన్స్ కూడా రెకమెండ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ అనేది పెద్దలకు మాత్రమే ఆరోగ్యకరమైనది కాదు పిల్లల కూడా ఆరోగ్యకరమే. ఆరోగ్యం మరియు రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ వల్ల శరీర వృద్దికి మరియు మెదడు చురుకుగా ఉండేందుకు చాలా సహాయపడుతుంది. అంతే కాదు క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల పిల్లలు మరియు పెద్దల ఇద్దరిలోనూ మానసిక, శారీరక శక్తి పెరుగుతుంది.

టమోటో మరియు పన్నీర్ సాండ్విచ్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో తయారు చేసే బ్రేక్ ఫాస్ట్ చాలా సులభం. ఈ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ ను వెజిటేబుల్స్ మరియు పండ్లతో కలిపి తినడం వల్ల పూర్తి భోజనం చేసినంత సంతృప్తిని కలిగిస్తుంది...

Healthy Tomato And Paneer Sandwich

కావల్సిన పదార్థా:
ఫ్రెంచ్ బ్రెడ్: 6 slices
బట్టర్: 1tsp
టమోటో ముక్కలు: ½ cup(chopped)
క్యాప్సికమ్: ½ cup (chopped)
ఉల్లిపాయ ముక్కలు: ½ cup (chopped)
పన్నీర్: ½ cup (chopped)
తులసి ఆకులు: 4 (chopped)
పెప్పర్ పౌడర్: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్రెంచ్ బ్రెడ్ స్లైస్ ను తీసుకొని దాని మీద బట్టర్ ను రాయాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ ను ఫ్రైయింగ్ పాన్ మీద వేసి వెన్న బ్రెడ్ స్లై మీద వెన్నకరిగే వరకూ వేడి చేయాలి.
2. బ్రెడ్ టోస్ట్ అయిన తర్వాత, అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించాయి.
3. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్, పన్నీర్, టమోటో ముక్కలు వేసి పది నిముషాల పాటు మెత్తగా వేగించుకోవాలి.
4. అలాగే ఈ ముక్కల మీద తులసి ఆకులు మరియు ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి వేగించాలి.
5. ఇప్పుడు ఈ వేగించుకొన్న టమోటో మిశ్రమాన్ని ఫ్రెండ్ బ్రెడ్ టోస్ట్ మీద కొద్దికొద్దిగా సర్దాలి. అంతే టమోటో పన్నీర్ సాండ్ విచ్ రెడీ. సులభమైన హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి.

English summary

Healthy Tomato And Paneer Sandwich Recipe | హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -టమోటో పన్నీర్ సాండ్విచ్

Breakfast is the most important meal of the day. Compared to lunch and dinner, breakfast is highly recommended by dietitians also. Breakfast is not just important for adults but also for kids. A healthy and regular breakfast helps in the development and growth of their body and brain. Daily intake of healthy breakfast improves physical, intellectual, and behavioural activities of both kids and adults.
Story first published: Tuesday, March 5, 2013, 18:19 [IST]
Desktop Bottom Promotion