For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాక్లెట్ బనానా మిల్క్ షేక్ తయారు చెయ్యడం ఎలా?

చాక్లెట్ బనానా మిల్క్ షేక్ తయారు చెయ్యడం ఎలా?

|

చాక్లెట్ మరియు అరటి పండుని కలిపి తయారు చేసే మిల్క్ షేక్ ఎంతో రుచిగా ఉంటుంది. వింటుంటేనే వెంటనే తయారుచేసి తాగాలనుంది కదా. అదేనండి చాక్లెట్ బనానా మిల్క్ షేక్ లోని గొప్పదనం. అరటిపండుని చాక్లెట్ మిల్క్ షేక్ తో కలపడం వల్ల అద్బుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. క్రీము మరియు పళ్ళ యొక్కరుచితో మాములు చాక్లెట్ మిల్క్ షేక్ కంటే బనానా చాక్లెట్ మిల్క్ షేక్ అత్యంత రుచికరంగా ఉంటుంది. చాలా మందిలో, చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ఆరోగ్యానికి చాలా అవసరమైనది. ఏంతో మంది హృదయపూర్వకంగా ఈ మిల్క్ షేక్ ని ఆస్వాదిస్తారు.

ఈ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం

అవసరమైన పదార్ధాలు:

అరటి పండు: 1
మామూలు చాక్లెట్ బార్: 1(సువాసన లేదా అదనపు ఆహార పదార్ధాలు లేకుండా ఉండేది)
పంచదార: రుచికి తగినంత
పాలు: మామూలు గ్లాస్ కి సరిపడా

How to Make a Chocolate Banana Milkshake

తయారు చేసే విధానం
1. అవసరమైతే బ్లేండెర్ ని ఉపయోగించవచ్చు లేదా మిల్క్ షేక్ ని చేతితోనే తయారు చేసుకోవచ్చు.

2. అరటి పండ్లని గుజ్జుగా చెయ్యండి. గుజ్జుగా చెయ్యడానికి ఫోర్క్ ని ఉపయోగించండి లేదా చేతితో చేసేటప్పుడు చేతులు నీటిగా ఉండేలా జాగ్రత్తపడండి. ఎటువంటి గడ్డలూ లేకుండా మెత్తటి గుజ్జులా చేసుకోండి.

3. మైక్రోవేవ్ లో చాక్లెట్ ని ద్రవం గా మారే వరకు కరిగించండి. అరటి పండు గుజ్జుతో దీనిని కలపండి.

4. అరటిపండు, చాక్లెట్ మిశ్రమానికి కొంచెం పంచదారని రుచి కోసం జోడించండి. మీకు ఎంత తీపి ఇష్టమో అంత పంచదార కలపండి. ఇప్పుడు కొంచెం పాలు జోడించి, ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.

5. ఇప్పుడు ఈ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ లో ఐస్ ముక్క లేదా ఏవైనా క్రీం లేదా మరేదైనా మీకు నచ్చిన వాటిని కలపండి.

చిట్కాలు

మీరు మీ పిల్లలకి కుడా ఎంతో సులభంగా ఈ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ని తయారు చేసుకోమని చెప్పవచ్చు.

హెచ్చరిక

బ్లెండెర్ వంటి సాధనాలు మీ పిల్లలు వాడేటప్పుడు మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

కావలసిన వస్తువులు:
అరటి పండుని గుజ్జు చెయ్యడానికి బ్లెండెర్, స్పూన్ లేదా ఫోర్క్ కావాలి.
మైక్రోవేవ్ లో వాడే గిన్నె ఉండాలి.
మిల్క్ షేక్ కోసం ఒక గ్లాస్ ఉండాలి. ఏంతో సులభంగా తయారుచేసుకునే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ గురించి తెలుసుకున్నారు కదా. ఇంకెందుకాలస్యం, వెంటనే తయారు చేసి మీ కుటుంబ సభ్యుల మెప్పుని పొందండి మరి.

English summary

How to Make a Chocolate Banana Milkshake | చాక్లెట్ బనానా మిల్క్ షేక్

What can be healthier than nourishing your system with milk and bananas? Even if you don't have time to drink it, carry it in a small bottle and sip it while travelling to your office.It is very easy to prepare this. Only two ingredients: milk and banana. You can also be more creative. Add any flavor to it or add some protein powder if you are someone who wishes to lift weights. You can consume it as a post-workout shake as the proteins and the carbs in the shake strengthen your muscles and energise you.
Desktop Bottom Promotion