For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇఫ్తార్ స్నాక్: క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్

|

టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టీ ఈవెనింగ్ స్నాక్ అంతే కాదు ఇఫ్తార్ స్నాక్ కూడా ముఖ్యంగా రంజాన్ నెలలో ఇఫ్తార్ కోసం వీటిని తీసుకోవచ్చు. సాధారణంగా మనం ఎప్పుడైతే ఈ ఫ్రెంజ్ ఫ్రైస్ తయారుచేసుకుంటే ఇవి చాలా సాప్ట్ గా మరియు చాలా సున్నితంగా బ్రేక్ చేసే విధంగా ఉంటాయి. అందుకే మనం ఇంట్లో తయారుచేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే బయటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాము.

READ MORE:సాయంకాలం తినదగ్గ టాప్ 10 లోకేలరీల చిరుతిళ్ళు !!

ఫ్రెంచ్ ఫ్రైస్ హెల్తీ స్నాక్ రిసిపి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను మరియు సాయంత్రం ఉపవాసం ముగిసిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. మరికెందుకు ఆలస్యం, వీటిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Iftaar Snacks: Crispy French Fries: Ramadan Special Snack

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4 స్లైస్ గా కట్ చేసుకోవాలి
చీజ్ తురుము: 2tbsp
థైమ్: 1tbsp
సీసాల్ట్: 1tsp
కారం: 1/2tsp
జీలకర్ర: 1/4tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
ఆలివ్ ఆయిల్: 2tbsp
వెనిగర్: 1tbsp

Iftaar Snacks: Crispy French Fries: Ramadan Special Snack

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసుకోవాలి.
2. ఫ్రెంచ్ ఫ్రైస్ స్లైస్ లా కట్ చేసుకొన్న బంగాళదుంప ముక్కలను చల్లటి నీళ్ళలో వేసి, అందులో ఒక చెంచా వెనిగర్ వేయాలి.
3. ఈ వెనిగర్ నీటిలో 30నిముషాలు నానబెట్టాలి.
4. తర్వాత నీళ్ళ నుండి బయటకు తీసేసి వాటి వేరే నీళ్లు పోసి శుభ్రం చేయాలి.
5. తర్వాత సాప్ట్ కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల తడి మొత్తం ఆరిపోతుంది.
6. తర్వాత మైక్రోవోవెన్ ను 200డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయాలి.

READ MORE: 15 స్పైసీ అండ్ టేస్టీ ఇండియన్ ఈవెనింగ్ స్నాక్స్

7. అందులో జీలకర్ర, ఉప్పు, ఆలివ్ ఆయిల్, చీజ్, పచ్చిమిర్చి, మిరయు పెప్పర్ ను ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చిలకరించి మైక్రోవోవెన్ లో పెట్టాలి.
8. తర్వాత వాటిని ఓవెన్ ట్రే మీద పడకుండా వాటిని సున్నితంగా కలియబెట్టాలి.
9. కలియబెడుతూనే 25నిముషాలు టోస్ చేస్తూ బేక్ చేయాలి.
10. ఇలా ఫ్రై చేసుకొన్నఫ్రెంచ్ ఫ్రైస్ ను బయటకు తీసి 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

Iftaar Snacks: Crispy French Fries: Ramadan Special Snack

11. తర్వాత తిరిగి ఓవెన్ ను 250 డిగ్రీల్లో పెట్టి, ఫ్రెంచ్ ఫ్రైస్ ను తిరిగి లోపల పెట్టాలి.
12. మరో 5నిముషాలు ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఫ్రై చేయాలి . అవి క్రిస్పీగా మూలల్లో మరియు చివర్లలో ముదురుబ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
13. తర్వాత వాటి బయటకు తీసి, వాటి మీద కొద్దిగా ఉప్పు, థైమ్, జీలకర్ర, మరియు పెప్పర్ చిలకరించాలి . అంతే వేడి వేడి స్నాక్ ను టమోటో సాస్ తో ఇప్తార్ కు సర్వ్ చేయండి...

English summary

Iftaar Snacks: Crispy French Fries: Ramadan Special Snack

Iftaar Snacks: Crispy French Fries: Telugu Vantalu. Try these tasty French fries as a best and light iftaar snacks during the holy month of Ramadan. Normally when we try to make French fries they become soft and break easily. That is the reason we always prefer to buy them rather than preparing at home. French fries are easy and simple to prepare and you can try this method to make them a look alike of market fries.
Story first published: Wednesday, July 1, 2015, 16:07 [IST]
Desktop Bottom Promotion