For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 స్పైసీ అండ్ టేస్టీ ఇండియన్ ఈవెనింగ్ స్నాక్స్

|

సాధారణంగా స్నాక్స్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఇంట్లోవారికి, ఆఫీసుల్లో పనిచేసేవారికి, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికీ స్నాక్స్ పిచ్చి ఉంటుంది. కొంతమందైతే స్నాక్స్ తినకుండా పనిచేయలు. ఇంకొంతమంది స్నాక్స్ లేకుండా చదవలేరు. స్నాక్స్ లేకుండా ప్రయాణం చేయలేరు ఇలా ఎవరెవరీ టేస్ట్ వారికుంటుంది. ఎవరైనా సరే బజార్ కు వెళ్ళినప్పుడు, షాపింగ్ కు వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినాల్సిందే. ఈ స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఒక రంగా మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఎందుకంటే వీటిని బియ్యం, లేదా బియ్యం పిండి మరియు ఇండియన్ మసాలాలు లేకుండా తయారుచేస్తారు. డీప్ ఫ్రై చేసిన ఇండియన్ స్నాక్ చాలా రుచికరంగా ఉంటాయి. వీటిని డిఫరెంట్ ఆయిల్స్ మరియు డిఫరెంట్ ఫ్లేవర్స్ తో తయారు చేసి ఉంటారు.

బయట వెళ్ళినప్పుడు స్టాల్స్ లో అలా ఓ లుక్కేయండి ఇటువంటి ఫ్రైడ్ స్నాక్స్ కోకొల్లలుగా ఉంటాయి. ఒక్కోక్కో స్టాల్లో ఒక్కో ఐటమ్ చాలా డిఫరెంట్ గా కనువిందు చేస్తూ నోరూరిస్తుంటాయి. అటువంటి స్నాక్స్ ను బయట చూసినప్పుడు మీకు తినాలనిపిస్తుంది. కానీ చాలా మందికి బయట తినడం ఇష్టం ఉండదు. అటువంటి వారు ఇట్లోనే తయారుచేసుకోవచ్చు. అంతే కాదు అటువంటి స్నాక్స్ ను తయారుచేయడం చాలా సులభం మరియు మన వంటగదిలో ఎప్పుడూ నిల్వఉండే వస్తువులతోటే వీటిని తయారుచేసుకోవచ్చు.

అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్య విషయమేటిటంటే మీరు ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి ఫ్రైడ్ స్నాక్స్ కు తినకూడదని మనస్సులో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఎక్కువ హానీ కలిగిస్తాయి.

ఈ ఈవెనింగ్ స్నాక్స్ కు ఖచ్చితంగా ప్రయత్నించి ఇట్లోనే తయారుచేసుకోవచ్చు. మరిఇంకెందుకు ఆలస్యం ఈ ఇండియన్ ఫ్రైడ్ ఈవెనింగ్ స్నాక్స్ మీద ఓ లుక్కేయండి...

బనానా చిప్స్:

బనానా చిప్స్:

మన ఇండియన్ స్నాక్స్ లో ఒక బెస్ట్ ఈవెనింగ్ స్నాక్స్ బనానా చిప్స్. వీటిని మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . మీడియంగా పండిన అరటిపండును మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో పల్చగా కట్ చేసి కాగేనూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. వేడిగా ఉన్నప్పుడే వాటి మీద పంచదార లేదా తేనెను చిలకరించవచ్చు. లేదా ఉప్పు, కారం కూడా చల్లుకోవచ్చు.

పొటాటో బోండా:

పొటాటో బోండా:

మీకు బంగాళదుంప ఎక్కువగా ఇష్టం అయితే. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ను ట్రై చేయాల్సిందే. ఈ బంగాళదుంప బోండాను శెనపిండి మరియు ఆలూ సబ్జీ మరియు కొన్ని ఇండియన్ మసాలాలు ఉపయోగిచి తయారుచేస్తారు.

సమోసా:

సమోసా:

ఇది మరొక ఫేవరెట్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. మరియు ఈవెనింగ్ స్నాక్ . ఈ రుచికరమైన ఫ్రైడ్ స్నాక్ ను ఇంట్లో తయారుచేసుకొని టమోటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో ఆరగించవచ్చు.

కచోరి:

కచోరి:

ఈ గుండ్రటి స్టప్డ్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఖచ్చింతగా ఈవెనింగ్ స్నాక్ గా ట్రై చేయవచ్చు. దీన్ని పెసరప్పు, ఉద్దిపప్పు కొన్ని ఇండియన్ మసాలా దినుసులు, పచ్చిబటానీలతో తయారుచేసిన స్టఫింగ్ ను మద్యలో స్టఫ్ చేసి తర్వాత క్రిస్పీగా డీప్ ఫ్రై చేయాలి. దీన్ని స్వీట్ లేదా కారంకారంగా ఉండే చట్నీతో తినవచ్చు.

మద్దూర్ వడ:

మద్దూర్ వడ:

ఒక బెస్ట్ ఇండియన్ స్టీట్ స్నాక్. దీన్ని వర్షాకాలంలో తయారుచేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా, క్రీపీగా ఉండే ఈ మద్దూర్ వడను బియ్యం పిండి, సెమోలినా అండ్ ఉల్లిపాయలు తయారు చేస్తారు.

మురుకు:

మురుకు:

ఈ ఫేమస్ సౌత్ ఇండియన్ ఫ్రైడ్ స్నాక్స్. దీన్ని బియ్యం పిండి, ఉద్దిపప్పు పిండితో తయారుచేస్తారు. చాలా మంది ఇండియన్స్ కు ఇవి చాలా ఇష్టమైన స్నాక్స్.

పకోరా:

పకోరా:

నోరూరించేవి మాత్రమే కాదు, ఈ పకోడాలు కడుపు నిండేలా చేస్తాయి. వీటిని వివిధ రకాల పదార్థాలు పనీర్, ఉల్లిపాయ, వెజిటేబుల్ పకోడా వంటివి తయారుచేసుకుంటారు .

సాడ్విచ్ :

సాడ్విచ్ :

గ్రిల్డ్ సాండ్విచ్ ఇండియ బెస్ట్ ఇండియన్ స్నాక్. మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఈ స్నాక్ ను తినవచ్చు . ఈ స్నాక్ ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ చేర్చడం వల్ల అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది.

వడ పావ్:

వడ పావ్:

మీరు ఈ ఇండియన్ స్టీట్ ఫుడ్ ను తినకపోతే ఒక అద్భుతమైన టేస్ట్ ను మిస్ అయ్యినట్లే. వడపావ్ నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ప్రస్తుతం సౌత్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది.

పావ్ బాజీ:

పావ్ బాజీ:

ఇది మరో ఇండియన్ షేమస్ స్ట్రీట్ ఫుడ్. వీటిని ఎక్కువగా హోటల్స్ లో చూడవచ్చు. ఈ పావ్ బాజీకి బెస్ట్ కాంబినేషన్ చిక్కగా ఉండే రుచికరమైన బంగాళదుంప కర్రీ.

సేవ్:

సేవ్:

ఫ్రైడ్ పదార్థాలు మీకు అమితంగా ఇష్టం అయితే ఇది ఫర్ ఫెక్ట్ ఇండియన్ ఫ్రైడ్ స్నాక్.

సకినాలు:

సకినాలు:

దీన్ని బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇవి ముఖ్యంగా ఆంధ్రావారి స్పెషల్ స్నాక్స్. వీటిని యంగ్ స్టర్స్ అందరూ అమితంగా ఇష్టపడుతారు.

పానీపూరి:

పానీపూరి:

చాట్ లవర్స్ కు ఫర్ ఫెక్ట్ స్నాక్ ఇది . రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ . ఇది చాలా ఫేమస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్. ఇది అతి త్వరగా కడుపు నింపేస్తుంది.

దబేలి:

దబేలి:

స్పైసీ ఇండియన్ స్ట్రీట్ స్నాక్ ఇది దీన్ని ఉడికించిన బంగాళదుంప, దబేలి మసాలాతో తయారు చేసి చిన్న బన్ లతో కలిపి ఇస్తారు . ఇది సాధారణ ఇండియన్ చాట్ ఫుడ్ ముఖ్యంగా మహారాష్ట్రలో.

చగోడిలు:

చగోడిలు:

ఇది ఫేమస్ ఇండియన్ ఫ్రైడ్ స్నాక్ . వేడి వేడి చాలా కమ్మగా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా వీటికి కారం ఎక్కువగా కలిపి చేస్తాయి. స్పైసీ స్నాక్స్ ఇష్టపడే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

English summary

Indian Fried Snacks For The Evening

We live in a city which is filled with people who love to do just one thing when they go shopping, and that is to eat tons of street food.
Story first published: Wednesday, September 25, 2013, 17:56 [IST]
Desktop Bottom Promotion