For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాల్ మురి: కోల్ కత్తా స్పెషల్ ఈవెనింగ్ స్నాక్

|

జాల్ మురి స్నాక్ రిసిపి కోల్ కత్తాలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. దీన్ని ఇంట్లో కూడా మనం స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఎక్కువగా వెస్ట్ బెంగాళ్ వెళ్ళినప్పుడు, ట్రై ఎక్కగానే ఈ జాల్ మురి సేల్స్ బాయ్స్ ఎక్కువగా కనబడుతారు. ఒక్కసారి ఈ స్నాక్ రిసిపిని టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కొన్ని సెకండ్లలో హావభావలను మార్చేసే మహత్తరమైన రుచి ఈ స్నాక్ రిసిపిది.

జాల్ మురి స్పైసీగా ఉంటుంది. ముఖ్యంగా మరమరాలు, మరియు మరికొన్ని మసాలాలతో తోటి తయారుచేస్తారు. కొన్ని నిముషల్లోనే తయారుచేసే ఈ స్నాక్ రిసిపిని ఒక రకంగా ఇన్ స్టాంట్ స్నాక్ గా పిలవచ్చు. మరి ఇంత్ హాట్ అండ్ టేస్ట్ స్నాక్ ను ఈ వర్షకాలంలో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఎలా తయారుచేయాలో ఒక సారి చూడండి....

Jhal Muri: Kolkata Special Snack Recipe

కావల్సిన పదార్థాలు:
మరమరాలు(బొరుగులు): 2cups
బంగాలదుంపలు: 2(కట్ చేసి ఉడికించి లేదా మ్యాష్ చేయాలి)
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4(సన్నగా కట్ చేసుకోవాలి)
సేవ్ పురి: 1/2cup
కాల చెన్న(బ్లాక్ గ్రామ్): 1/2cup(నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1tbsp
పికెల్ మసాలా: 1tsp
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
మస్టరన్డ్ ఆయిల్: 1tbsp
కొబ్బరి తురుము: గార్నిష్ కోసం

తయారుచేయు విధానం:
1. ముందుగా నానబెట్టుకొన్న కాల చెన్న నుండి నీళ్ళను వంపి కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పైన ఇచ్చిన పదార్థాలన్నింటిని అందులో వేయాలి.
3. ఈ మొత్తం పదార్థాలన్ని కలగలిసేలా చేత్తో లేదా స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
5. మిక్స్ చేసిన తర్వాత చివరగా కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే జాల్ మురి రిసిపి రెడీ..వర్షాకాలంలో స్పైసీ స్నాక్ కు తింటూ ఎంజాయ్ చేయండి...

English summary

Jhal Muri: Kolkata Special Snack Recipe

Jhal muri forms an integral part of life for the people of Kolkata or in fact the whole of West Bengal. As soon as you step on a train to Kolkata, first thing which you hear on it is the hawker who sells jhal muri. It is so mesmerising to see the person make this interesting snack in a matter of few seconds.
Story first published: Wednesday, October 29, 2014, 18:10 [IST]
Desktop Bottom Promotion