For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు

|

వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి.

'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం..

Jilledu Kayalu

కావలసిన పదార్థాలు:
బియ్యప్పిండి: 2cups
నీరు: 5cups
కొబ్బరితురుము: 1cup
బెల్లం తురుము: 1cup
ఏలకులపొడి: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి.
2. తర్వాత బియ్యప్పిండి వేసి బాగా కలిపి మంట తగ్గించి, పదినిముషాలుంచి దించేయాలి.
3. ఇప్పుడు పాన్ లో కొబ్బరితురుము, బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి స్టౌమీద ఉంచి, ఉడికించి దించేయాలి.
4. చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.
5. తర్వాత కొద్దిగా బియ్యప్పిండిని చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి కొబ్బరి ఉండను అందులో ఉంచి జిల్లేడుకాయ ఆకారంలో అంచులను మూసేయాలి.
6. ఇలా అన్నీ తయారుచేకుని, ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్‌లో పెట్టి, మూత ఉంచాలి. పదినిముషాలయ్యాక దించేయాలి. (విజిల్ పెట్టకూడదు)

English summary

Jilledu Kayalu-Vinayaka Chavithi Special

Jilledukayalu is a traditional sweet of Andhra Pradesh. It can be prepared by Rice atta, coconut and Jaggery. Its very simple procedure to make them. It has Fiber, Calcium, Iron,carbohydrates,Protein.
Story first published: Saturday, September 7, 2013, 12:44 [IST]
Desktop Bottom Promotion