For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజు బర్ఫీ- దీపావళి స్పెషల్ రిసిపి

|

కాజు బర్ఫీ చాలా టేస్టీగా ఉండే స్వీట్ రిసిపి. మార్కెట్లో దీని ధరకూడా ఎక్కువే. సాధారణంగా దీపావళికి వివిధ రకాల స్వీట్స్ ను తయారుచేస్తుంటారు. అందులో కాజు బర్ఫీ కూడా ఒకటి. సాధారణంగా వీటిని రోల్స్ లా తయారుచేస్తుంటారు. బర్ఫీగా చేయడం అంటే కొంత రిస్కే. ఎందుకంటే బర్ఫీఫీకి షుగర్ సిరఫ్ పర్ఫెక్ట్ గా కుదరాలి. షుగర్ సిరప్ చిక్కగా ఉంటే, బర్ఫీ గట్టిగా తయారువుతుంది, అయితే సిరఫ్ చాలా పల్చగా ఉన్నాకష్టమే. కాబట్టి షుగర్ సిరఫ్ మీడియంగా ఉండేలా చూసుకోవాలి.

షుగర్ సిరప్ తయారుచేసేటప్పుడు, ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి అందులో ఉడుకుతున్న షుగర్ సిరఫ్ ఒక డ్రాప్ వేస్తే ఉండలా వస్తుంది, దాన్ని రెండు వేళ్ళతో తీసుకొనే చూస్తే అది చిక్కగా జారుడుగా అనిపిస్తుంది. అది ఫర్ ఫెక్ట్ పాకంగా గుర్తించి తర్వాత మిగిలిన పదార్థాలు జోడించుకోవాలి. ఈ మొత్తం రిసిపి షుగర్ సిరప్ మీదే ఆధారపడి ఉంది. మరి దీపావళి స్పెషల్ గా ఈ రిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Kaju Ki Barfi: Diwali Special Recipe

కావల్సిన పదార్థాలు
జీడిపప్పు: 1cup (గది ఉష్ణోగ్రత)
కార్న్ ఫ్లోర్: 1tsp(మీరు ఉపవాసంలో ఉంటే కను, కార్న్ ఫ్లోర్ జోడించకండి)
చక్కెర: ½cup
నీళ్ళు: ¼cup
నెయ్యి: కొద్దిగా
గార్నిషింగ్ కోసం: సిల్వర్ ఫోయిల్ (అవసరం అయితే)

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీలో జీడిపప్పు, కార్న్ ఫ్లోర్ వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా పౌడర్ చేయాలి.
2. తర్వాత స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, అందులో పంచదార మరియు నీళ్ళు పోసి బాగా మరిగించాలి.
3. పంచదార సిరఫ్ చిక్కబడేంత వరకూ మీడియం మంట మీద మరిగిస్తుండాలి.
4. తర్వాత అందులో ముందుగా పొడి చేసిపెట్టుకొన్న జీడిపప్పు మరియు కార్న్ ఫ్లోర్ పౌడర్ ను వేయాలి. చాలా తక్కువ మంట మీద 3-4నిముషాలు ఉడికించాలి.
5. ఎక్కువ సేపు ఉడికించకండి. తర్వాత క్రిందికి దింపి 5నిముషాలు చల్లారనివ్వాలి.
6. అంతలోపు ఒక వెడల్పాటి ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాయాలి. తర్వాత ఉడికించి మీడియంగా చల్లారిన మిశ్రమాన్ని ప్లేట్ లో పోసి, మరో రెండు మూడు నిముషాలు చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతన సిల్వర్ ఫోయిల్ తో అలంకరించండి. కొద్దిసేపటి తర్వాత దీన్ని తినవచ్చు. లేదా గాలిచొరబడని డబ్బాలో వేసి మూత్త గట్టిగా పెట్టి, వారం పాటు ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు.

English summary

Kaju Ki Barfi: Diwali Special Recipe

This kaju ki barfi recipe is so easy and fool proof that you'll never want to buy it from market at such high price. Diwali is approaching, so I thought to share this recipe with you all. I also make stuffed rolls with the same recipe.
Desktop Bottom Promotion