For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలకండ్ రిసిపి- శ్రీ క్రిష్ణజన్మాష్టమి స్పెషల్

|

శ్రీక్రిష్ణ జన్మాష్టమికి ఇటువంటి స్పెషల్ స్వీట్స్ తయారు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా పాలతో తయారు చేసే వంటలన్నీ వెన్నలా కనిపిస్తూ కళకళలాడుతూ, జన్మాష్టమిని మరింత బ్రైట్ చేస్తాయి ఈ వంటలు.

మీరు ఎప్పుడైన మిల్క్ కేక్ ను తయారు చేయడానికి ప్రయత్నించారా?అదేనండి కలకండ్. కలకండ్ ను తయారు చేయడానికి చాలా తక్కువ పదార్థలు అవసరం అవుతాయి. వీటిని కనుక సిద్దం చేసుకొంటే, ఈ జన్మాష్టమి స్వీట్ తయారు చేయడం చాలా సులభం. మరియు అతి త్వరగా రెడీ అవుతుంది. మరి ఈ జన్మాష్టమి రోజున ఈ కలకండ్ రిసిపిని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దామా...

Kalakhand Recipe For Krishna Janmashtami

కావల్సిన పదార్థాలు:
పాలు: 1ltr
ఫ్రెష్ పనీర్: 1kg
పంచదార : 1cup
బాదం, పిస్తా : గుప్పెడు(ముక్కలుగా చేయాలి)
యాలకుల పొడి : 1tsp
బట్టర్: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా మందగా ఉన్న పాన్ తీసుకొని అందులో పాలు పోసి బాగా కాచాలి. పాలు చిక్క బడేవరకు బాగా కాచాలి. మరియు మద్యమద్యలో కలియబెడుతుండాలి. పాలు మరుగుతున్నప్పుడే అందు తాజా పన్నీర్ ముక్కల చిదిమి, పాలలో మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే, పంచదార, యాలకుల పొడి వేసి, ఈ మిశ్రమం గట్టిపడే వరకూ కంటిన్యూగా కలియబెడుతుండాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా గట్టిపడ్డాక ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కు బట్టర్ బాగా రాసి అందలోకి మార్చుకోవాలి. తర్వాత వాటి మీద బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. అంతే టేస్టీ కలకండ రెడీ

English summary

Kalakhand Recipe For Krishna Janmashtami

It is nice to prepare Kalakhand on Krishna Janmashtami. All the clay pots can be filled with white sweet dish that look like butter filled pots for Krishna as well as a festive delight.
Story first published: Wednesday, August 28, 2013, 12:08 [IST]
Desktop Bottom Promotion