For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్స్ స్పెషల్ రిసిపి - మ్యాంగో కుల్ఫీ

|

సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయల సీజన్ చాలా మందికి మామిడి పండ్లన్నా..కాయలన్నా చాలా ఇష్టం అంతే కాదు. వేసవి కాలంలో ఎండ వేడి చిరాకు పెట్టించినా... మామిడి పండ్ల తియ్యదనం, కాయల పచ్చడి రుచులు గుర్తుకురాగానే ఆ వేడి చల్లగా పక్కకు జారుకుంటుంది. మామిడి పండును రొటీన్‌గా ముక్కలు కోసుకుని తినడమో, రసం తీసుకుని తాగడమో కాకుండా వెరైటీగా కుల్ఫీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది...

పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండోయ్ . ఎందుకంటే మామిడి పండ్లంటే అందరీ చాలా ఇష్టం వాటి వాసన, రుచి, రంగు ఇట్టే ఆకర్షించేస్తాయి. అంతే కాదండోయ్ వీటిలో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే. ప్రతి రోజూ ఒక మామిడి పండును తీసుకోవడం వల్ల హెల్తీ డైట్ పూర్తవుతుంది. ఇవి మీ డైట్, మరియు టేస్ట్ ను ఫుల్ ఫిల్ చేయడం మాత్రమే కాదు అనేక స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యమే కావచ్చు. అయితే ఇది మాత్రం నిజం.

Mango Kulfi
కావల్సిన పదార్థాలు
పాలు: 3cups
కండెన్స్డ్ మిల్క్: 1/2cup
మామిడి గుజ్జు: 1cup
మిల్క్ పౌడర్: 1/2cup
యాలకులు: 1tsp
పంచదార: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాట్ వెజల్ తీసుకొని, అందులో పాలు, కండెన్డ్స్ మిల్క్, పంచదార మరియు మిల్క్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ మీద పెట్టి బాగా ఉడికించి కోవాలి.

2. కొదిసేపు బాగా ఉడికిన తర్వాత మంట పూర్తిగా తగ్గించి 15-20నిముషాలు ఉడికించుకోవాలి.

3. ఈ మిశ్రమం ఉడుకుతుండగానే అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

5. ఒక్కసారి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మామిడి గుజ్జును వేసి బాగా మిక్స్ చేయాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్పీ మౌల్డ్స్ (కుల్ఫీ అచ్చుల్లో)పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. కుల్ఫీ సెట్ అయ్యే వరకూ కనీసం 6-8గంటల సమయం ఫ్రిజ్ లో ఉంచాలి.

7. 8గంటల తర్వాత కుల్ఫీ సెట్ అవ్వగానే ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మౌల్డ్స్ ను కుల్ఫీలను వేరు చేసి, సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో కుల్పీ రెడీ..

English summary

Kid's Special Recipe: Mango Kulfi


 Summer is at its peak and the vacations are on. This season is special in India since it is the only time when we can relish the king of fruits- Mango. Why not prepare something special for your kids with mango? Almost all kids love to eat mangoes.
Story first published: Thursday, June 6, 2013, 17:26 [IST]
Desktop Bottom Promotion