For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లీచీ మిల్క్ షేక్-రుచికరమైన వేసవి డిలైట్

|

వేసవిలో తాజాతాజాగా కనబడాలంటే?ఈ లిచి మిల్క్ షేక్ ను ట్రై చేయండి. ఈ తియ్యని మరియు జ్యూసీ పండును వేసవి సీజన్ లో అధికంగా లభ్యం అవుతాయి. లీచీ పండు రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇది అతి తేలికగా జీర్ణం అవ్వడానికి మరియు శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి సమ్మర్ డ్రింక్ గా తీసుకోవడం చాలా మంచి ఎంపిక.

లీచీ షేక్ తయారు చేయడం చాలా సులభం మరియు పిల్లలు చాలా ఇష్టంగా సేవిస్తారు . యాలకుల వేయడం వల్ల రుచికి తగ్గ ఫ్లేవర్ అంధించగలం. మరి రుచి మరియు ఆరోగ్యకరమైన ప్రయోజనం కలిగించే లీచీ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...

Lychee Shake

కావల్సిన పదార్థాలు:
లిచి: 250grms
పాలు: 3cups
పంచదార: 2tsp
యాలకులు: 2
ఐస్ క్యూబ్స్: 5-6

తయారు చేయు విధానం:
1. ముందుగా లిచి పండ్లను బాగా శుభ్రంగా కడిగి పొట్టు తీసి లోపల గింజలను తొలగించాలి.
2. తర్వాత యాలకుల రెండుగా విడిచేసి అందులోని గింజలను బయటకు తీసేయాలి.
3. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో లిచి, పాలు, యాలకులు, మరియు పంచదార కూడా వేసి, స్మూత్ గా బ్లెడ్ చేసుకోవాలి.
4. తర్వాత ఈ మిల్క్ షేక్ ను సర్వింగ్ గ్లాస్ లోనికి మార్చుకొని, ఐస్ క్యూబ్ లను వేసి చల్ల..చల్లగా సర్వ్ చేయాలి. అంతే సర్వ్ చేయడానికి లిచి షేక్ రెడీ.

English summary

Lychee Shake: Delicious Summer Delight

Looking for a refreshing summer drink? Try lychee milkshake. This sweet and juicy tropical fruit is found in abundance during this season. Apart from being delicious, lychee is healthy too. It is an excellent source of vitamin C, helps in digestion and provides energy.
Story first published: Wednesday, June 12, 2013, 17:31 [IST]
Desktop Bottom Promotion