For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలై గీవర్ శ్రీ క్రిష్ణ జన్మాష్టమి స్పెషల్ స్వీట్

|

మలై గీవర్ రాజస్థానీ డిలిషియస్ రిసిపి. ఈ స్పెషల్ స్వీట్ ను ఎక్కువగా శ్రావణ మాసంలో తయారు చేసుకుంటారు. మార్కెట్లో కూడా ఈ స్పెషల్ స్వీట్ ఈ మాసంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్వీట్ శ్రామణమాసంలో అధికంగా ఎందుకు చేసుకుంటారు? రక్షాబందన్, తర్వాత వెంటనే వచ్చే శ్రీ క్రిష్ణ జన్మాష్టమికి ఎక్కువగా తయారు చేస్తారు. మరి మీరు కూడా జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లైతే ఈ స్పెషల్ స్వీట్ మీద ఓ లుక్ ఏయండి. ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి...

ఈ స్పెషల్ స్వీట్ తయారు చేయడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టినా, ఓపికగా తయారు చేసుకుంటే అద్భుతమైన రుచితో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల, బందువుల నోటికి ఓ కొత్త రుచిని అంధించి ప్రశంసలు చాలానే మీరు అందుకోవచ్చు. మరికెందుకు ఆలస్యం మొదలెట్టండి...

కావల్సిన పదార్థాలు:
గీవర్ కోసం:
నెయ్యి / వెన్న: 1/4 cup
చల్లగా ఉండే క్రీమ్ మిల్క్ : 1/4cup
మైదాపిండి: 2cups
చల్లని నీళ్ళు: 4 cups
ఎల్లో ఫుడ్ కలర్ : ఒక చిటికెడు
వేయించడానికి నెయ్యి లేదా నూనె

చక్కెర సిరప్ కోసం:
చక్కెర: 1 మరియు 1/2cup
నీళ్ళు: 1cup
కుంకుమ పువ్వు: కొద్దిగా
ఏలకుల: 2- 3 (పొడిచేసుకోవాలి)

మాలై rabdi కోసం:
ఫుల్ క్రీమ్ మిల్క్: 1 ltr
పంచదార: 1/4cup
Kewda ఎసెన్స్: 2- 3 చుక్కలు
ఏలకుల పొడి : 1 / 4 tsp
డ్రై ఫ్రూట్స్ : గార్నిషింగ్ కోసం

తయారు చేయు విధానం:

గీవర్ తయారు చేసుకొనే విధానం:

గీవర్ తయారు చేసుకొనే విధానం:

a. ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి మరియు పాలు వేసి బాగా గిలకొట్టాలి.

b. తర్వాత అందులోనే మైదా కూడా వేసి మిక్స్ చేయాలి.

c. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి జారుడుగా ఉండలు కంట్టకుండా బాగాకలుపుకోవాలి (ఒక వేళ ఉండలున్నట్లైతే సూప్ స్టైనర్ తో జారుడుగా కలిపిన పిండిని వడకట్టుకోవచ్చు)

d. తర్వాత అందులోనే ఎల్లో ఫుడ్ కలర్వ ేసి బాగా మిక్స్ చేయాలి.

e. తర్వాత ఒక సాస్ పాన్ ( 4ఇంచెస్ ఉన్న పాన్)తీసుకొని అందులోనెయ్యి వేసి, నెయ్యిని సగం బాగం వరకూ నింపాలి. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టి నెయ్యిని బాగా కాగనివ్వాలి .

f. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జారుడుగా కలిపి పెట్టుకొన్న పిండిని కాగే నెయ్యిలో పాన్ సెంటర్ లో ఒక అడుగు ఎంతు నుండి పోయాలి. సాధ్యమైనంత త్వరగా పిండిని మొత్తాన్ని పోసేయాలి. మంట అలాగే ఎక్కువగా ఉండాలి. కానీ పిండిమాత్రం బాగా పొంగుతుంది. అటువంటప్పుడు కొద్దిగా దూరంగా జాగ్రత్తగా ఉండాలి.

 పిండి ఎక్కువగా పొంగితే

పిండి ఎక్కువగా పొంగితే

g. పిండి ఎక్కువగా పొంగితే మాత్రం, పొండి పోయడాన్ని నిలిపివేయాలి. నెయ్యిలో బుడగలు రానివ్వాలి.

h. తర్వాత అదే పిండి మీద మరికొంత పిండిని తిరిగి పోయాలి. పిండి పోయడానికి ముందు ప్రతి సారి కలియబెట్టాలి.తర్వాత ఒక నిముషం ఉడికించుకోవాలి.

i. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి. ఇప్పుడు ఈ పిండిని షీవర్ తో మద్యలో రంద్రంలా పెట్టాలి.

j. ఇప్పుడు ఈ గ్రీవర్ లౌట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ మంటను ఎక్కువగా పెట్టి ఉడకనివ్వాలి .(అందుకోసం కొంత సమయం తీసుకుంటుంది. కొంత ఓపికగా ఉండాలి).

k. ఇప్పడు ఫోర్క్ తో గీవర్ ను పాన్ నుండి పక్కకు తీసుకోవాలి. ఈ గీవర్ ను ఒక మందపాటి వెడల్పు ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి.

షుగర్ సిరఫ్ :

షుగర్ సిరఫ్ :

l. పాన్ లో పంచదారన, నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి. సిరప్ లా తయారుయ్యే సమయంలో యాలకుల పొడి మరియు కుంకుమపువ్వును వేసి మిక్స్ చేసి, మీడియం మంట మీద బాగా ఉడికించుకోవడం వల్ల షుగర్ సిరఫ్ తయారవుతుంది.

షుగర్ సిరఫ్ లో డిప్ చేసి పది నిముషాల పాటు

షుగర్ సిరఫ్ లో డిప్ చేసి పది నిముషాల పాటు

m.తర్వాత ముందుగా తయారు చేసుకొన్న గీవర్ ను ఈ షుగర్ సిరఫ్ లో డిప్ చేసి పది నిముషాల పాటు అలాగే ఉంచాలా. ఇలా అన్ని వైపులా డిప్ చేసి, షుగర్ సిరఫ్ లో పూర్తిగా నానేలా చేయాలి.

n. తర్వాత ఈ షుగర్ గీవర్ మీద మలైరబ్దీని పోయాలి. చివరగా పిస్తా మరియు బాదంలను గార్నిష్ చేయాలి.

ఈ స్పెషల్ స్వీట్ ను ఎంజాయ్ చేయండి:

ఈ స్పెషల్ స్వీట్ ను ఎంజాయ్ చేయండి:

అంతే మలై గీవర్ రెడీ. దీన్ని స్పెషల్ ట్రీట్ గా జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకోండి.

English summary

Malai Ghevar: Janmashtami Sweet


 Janmashtami is just round the corner. It is the time of rejoicing and celebrations all over India. Janmashtami is the birth celebration of Lord Krishna.
Story first published: Tuesday, August 27, 2013, 12:58 [IST]
Desktop Bottom Promotion