For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలై లడ్డు- నవరాత్రి స్పెషల్

|

పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే లడ్డూల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. లడ్డూ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. అందుకే ఈ దసరాకు మీకోసం.. 'లడ్డూ స్పెషల్'.

Malai Ladoo

కావలసిన పదార్థాలు :
మైదాపిండి: 1/2kg
నెయ్యి: 400grm
పంచదార పొడి: 1kg
జీడిపప్పు: 1/4kg
హార్లిక్స్: 200grm
అమూల్ స్ప్రే: 800grm
జాజికాయ, జాపత్రి: 5grm
యాలకుల పొడి: 10grms
కిస్‌మిస్: 50grms
పిస్తాపప్పు: 100
బాదంపప్పు: 100grms

తయారుచేసే విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ ఉంచి నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో మైదాపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. మైదా వేగిందో లేదో తెలియాలంటే ఒక నీటి చుక్క మైదాపిండిపై వేయాలి. అది పొంగితే మైదాపిండి వేగిందని అర్థం. ఇలా వేగిన మైదాను ఒక గిన్నెలోకి తీసి చల్లార్చాలి.
2. తర్వాత పూర్తిగా చల్లారాక అందులో అమూల్ స్ప్రే, హార్లిక్స్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి బాగా మెత్తగా ఉంటే పంచదార పొడి మరికొంత వేసుకోవచ్చు.
3. తర్వాత జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసి నేతిలో వేయించి ఈ పిండిలో వేయాలి. కిస్‌మిస్, యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి కూడా చేర్చి నెమ్మదిగా కలపాలి.
4. ఇలా తయారైన లడ్డు పిండి కాసేపు ఆరాక అరచేతికి నెయ్యిగాని నూనెగాని రాసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే మలై లడ్డు రెడీ..

English summary

Malai Ladoo:Navratri Special

Malai Ladoo - Malai ladoo is a north Indian snack made of paneer and milk.but here we took maida and ghee. Just like a peda preparations but mould in the shape of ladoos and rolled in dessicated coconut or crushed nuts, easy to make in bulk for parties or for celebrations and Festivals.
Story first published: Friday, October 11, 2013, 16:33 [IST]
Desktop Bottom Promotion